అయ్యప్ప స్వాముల మాలధారణల నేపథ్యంలో శబరిమల వెళ్లే రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కొల్లం వరకు ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 19-22 తేదీల మధ్య కాచిగూడ-కొల్లం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని.. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఈనెల 17న సికింద్రాబాద్-కొల్లం మధ్య, 19న కొల్లం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నామన్నారు.
ఈనెల 19, 20 తేదీల్లో కాచిగూడ నుంచి 07053, 07141 నంబర్లతో కొల్లంకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని.. అలాగే ఈనెల 21, 22 తేదీల్లో కొల్లం నుంచి 07054, 07142 నంబర్లు గల రైళ్లు కాచిగూడ వెళ్తాయని అధికారులు తెలిపారు. 07053, 07054 ప్రత్యేక రైళ్లు షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పట్టాయ్, సేలం, కోయంబత్తూర్, పలక్కాడ్, త్రిసూర్, ఎర్నాకుళం, కొట్టాయం, చెగంచేరి, తిరువల్లా, చెంగనూరు, మవెలికర, కాయన్ కులం రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయని పేర్కొన్నారు.
Read Also: ఉత్తమ నటిగా సమంత… ముంబై అవార్డుల వేడుకలో సందడి
మరోవైపు 07141, 07142 ప్రత్యేకరైళ్లు సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సెరం, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, కొండూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పట్టాయ్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పలక్కాడ్, త్రిసూర్, ఎర్నాకుళం, కొట్టాయం, చెగంచేరి, తిరువల్లా, చెంగనూరు, మవెలికర, కాయన్ కులం రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.