Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు. పది రోజుల పాటు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు.. ఆన్‌లైన్ విధానంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. రోజుకు 25 వేల […]
Andhra Pradesh: అభివృద్ధి వికేంద్రీకరణే ధ్యేయంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 5న కర్నూలు వేదికగా రాయలసీమ గర్జన జరగనుంది. ఎస్టీబీసీ గ్రౌండ్స్‌లో రాయలసీమ గర్జనను భారీగా నిర్వహించాలని నాన్ పొలిటికల్ జేఏసీ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు […]
Dutee Chand: అథ్లెటిక్స్‌లో ఒడిశాకు చెందిన ద్యుతీచంద్ ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ స్ర్పింటర్‌గా కొనసాగుతోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎన్నో ఆటుపోట్లను దాటుకుని వచ్చి స్టార్ అథ్లెట్‌గా ఎదిగింది. కొన్నేళ్ల కిందట తాను స్వలింగ సంబంధంలో ఉన్నానంటూ ఆమె భారత క్రీడారంగాన్ని ఆశ్చర్యపరిచింది. తాను స్వలింగ సంపర్కురాలినని బహిరంగంగా చెప్పిన భారత తొలి అథ్లెట్ ద్యుతీచంద్ కావడం గమనించాల్సిన విషయం. తాజాగా ఆమె తన ప్రేయసి మోనాలీసాను పరిచయం చేసింది. ఈ మేరకు […]
Pakistan Cricket Board: పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనే విషయంపై వివాదం నడుస్తోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తోంది. ఇదే జరిగితే ఆసియా కప్ కళ తప్పుతుంది. దీంతో పాకిస్థాన్ బోర్డు బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ తమ దేశానికి వచ్చి ఆసియా కప్ ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు దూరంగా ఉంటామని గతంలోనే చెప్పింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను […]
Telugu Desam Party: ఏపీ సీఎం జగన్‌కు రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగలేఖ రాశారు. వైసీపీ నేతల ఆధ్వర్యంలో కృష్ణా నదీ తీరంలోని దిబ్బలు, ద్వీపాల్లో యధేచ్ఛగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని ఎమ్మెల్యే అనగాని తన లేఖలో ప్రస్తావించారు. జూద కేంద్రాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని గుర్తుచేశారు. రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులు పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. […]
Team India: బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. చేతి గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. అతడికి దాదాపు రెండు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దీంతో బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల నుంచి షమీ తప్పుకున్నట్లు పీటీఐ వెల్లడించింది. Read Also: Andhra Pradesh: […]
Viral News: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు జాబ్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని జాబ్ ఆఫర్లు విచిత్రంగా ఉంటాయని చెప్పడానికి ఈ వార్తే నిదర్శనం. అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇచ్చిన జాబ్ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎలుకలు పట్టేందుకు ఆయన ఓ కొత్త పోస్టు సృష్టించారు. ఈ జాబ్ ఆఫర్ ద్వారా ఏడాదికి రూ.1.38 కోట్ల శాలరీ ఇస్తామని ప్రకటించారు. ఈ వివరాలను ఆడమ్స్ తన […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=t6Nixa9b30I
Iron Rod: మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. రోడ్డుపై మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఒక్కోసారి మృత్యువు కాటేస్తుంది. కానీ రైలులో కూర్చున్న ప్రయాణికుడికి మృత్యువు కిటికీలో నుంచి దూసుకువచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఎవరి ఊహకు అందదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హరికేశ్ కుమార్ దూబే అనే వ్యక్తి విండో సీటు పక్కన కూర్చున్నాడు. తోటి ప్రయాణికులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ […]
Vijay Hazare Trophy: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ మరో సెంచరీ సాధించాడు. అయినా మహారాష్ట్రకు నిరాశ తప్పలేదు. ఫైనల్లో ఆ జట్టుపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. షెల్డన్ జాక్సన్ అద్భుత సెంచరీ చేశాడు. 136 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133 నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత […]