What’s Today: • ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు నేడు కాంగ్రెస్ వ్యూహం ఖరారు.. నేడు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ • కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరు కానున్న సీఎం • తిరుమల: నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం • తూర్పుగోదావరి జిల్లా: నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదు […]
OTT Updates: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో విజయవంతమైన ప్యార్ ప్రేమ కాదల్ సినిమ ఆధారంగా ఊర్వశివో రాక్షసివో సినిమాను తెరకెక్కించారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో అల్లు శిరీష్ ప్రేక్షకుల […]
Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను మోసం చేశాడు కాబట్టే.. చంద్రబాబుకు తిరుమల వెంకటేశ్వరస్వామి శాపం పెట్టాడని ఆరోపించారు. తన కొడుకు వయసులో ఉన్న జగన్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడి మానసికంగా చంద్రబాబు క్షోభ పడేలా దేవుడు చేశాడని వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నాడని.. ఇప్పుడు పోలవరం వెళ్లి ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడని పేర్ని నాని […]
GVL NarasimhaRao: విశాఖలో భూకబ్జాలపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు వైసీపీ, టీడీపీలకు ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, విశాఖ భూ కబ్జాలపై వైసీపీ, టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. త్వరలోనే బహిరంగ చర్చకు పిలుస్తామని.. సిద్ధంగా ఉండాలని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం నిర్మిస్తుంటే వైసీపీ, టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నాయని.. పోలవరం నిర్మాణం ఆలస్యానికి వైసీపీ […]
Tirumala: రుమలలో సరికొత్త రికార్డుల దిశగా శ్రీవారి హుండీ ఆదాయం సాగుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేయగా.. కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది. 8 నెలలుగా ప్రతి నెలా తిరుమల వెంకటేశుడి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటుతోంది. తాజాగా వరుసగా 9వ నెల కూడా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం. […]
Paritala Sriram: గతంలో ఓ వివాదంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు అప్పటి టీడీపీ నేత పరిటాల రవి గుండు కొట్టించారని తెగ ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో నిజానిజాలేంటో ఎవ్వరికీ తెలియదు. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పేస్తుంటారు. స్వయంగా మంత్రి రోజా కూడా ఓ సందర్భంలో పవన్‌ను విమర్శిస్తూ ఈ గుండు ప్రస్తావన తెచ్చారు. అయితే ఈ ప్రచారం మీద తాజాగా పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ […]
Medical Students: ఏపీలో వైద్య విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించరాదని తన ఆదేశాల్లో పేర్కొంది. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు అబ్బాయిలు అయితే టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు వేసుకోకూడదని.. అమ్మాయిలు అయితే చీర, చుడీదార్ మాత్రమే ధరించాలని సూచించింది. విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో జరిగిన వారాంతపు సమీక్షలో ఈ నిర్ణయాలను […]
Bigg Boss 6: తెలుగు స్టార్ సింగర్, బిగ్‌బాస్ -6 కంటెస్టెంట్ రేవంత్ ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. రేవంత్ భార్య అన్విత శుక్రవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేవంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సమయంలో అన్విత నిండు గర్భిణీగా ఉంది. ప్రస్తుతం ఇంకా అతడు హౌస్‌లోనే ఉన్నాడు. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. దాదాపు రేవంత్ విన్నర్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా […]
Andhra Pradesh: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వచ్చిన ఆమె.. ఈసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. ఈనెల 4న ఢిల్లీ నుంచి ఆమె విజయవాడ చేరుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వివరాలను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా వెల్లడించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో ప్రత్యేక […]
Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ సమీపిస్తున్న సందర్భంగా గుడిమెల్లంకలో స్థానిక ఓబెరు చర్చిలో అప్పుడే సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 70 కిలోల స్టార్ లైట్‌ను చర్చి పిల్లర్‌కు కడుతుండగా సిమెంట్ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో చెలిమి శివకృష్ణ (27) అనే యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. అయితే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. Read Also: Andhra Pradesh: ప్రత్తిపాడులో రెండు లారీలు […]