Andhra Pradesh: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు, కుర్చీలు పగిలిపోగా, కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సదుంలో రైతు భేరి నిర్వహిస్తామని చెప్పడంతోనే వైసీపీ శ్రేణులు పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. […]
Twin Sisters: కవలలుగా పుట్టిన అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లాడిన సంఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తాలూకాకు చెందిన అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే వివాహ వేదికపై ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వరుడు అతుల్ స్వస్థలం షోలాపూర్ కాగా కవల వధువులు రింకీ, పింకీ ముంబైలోని కండివాలికి చెందినవారు. అతుల్‌కు ట్రావెల్ ఏజెన్సీ ఉండగా.. కవల సోదరీమణులు ముంబైలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట తండ్రి మరణించగా ప్రస్తుతం తల్లితో […]
CPI Ramakrishna: ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఏపీలో జగన్ పాలనలో అన్నీ రివర్స్‌లో జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎక్కడైనా చిన్న పార్టీలు, ప్రతిపక్షాలు ఉద్యమించడం చూశామని.. కానీ ఏపీలో వైసీపీనే ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు. కర్నూలు వేదికగా రాయలసీమ గర్జనను వైసీపీనే ముందుండి నడిపిస్తుందని.. ఇది ప్రజలను దారుణంగా […]
Shakib Al Hasan: టీమిండియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన తొలి వన్డేలో అతడు 10 ఓవర్లు వేసి 36 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డేల్లో టీమిండియాపై ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబుల్ హసన్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ […]
Andhra Pradesh: ఏపీలో మూడు రాజధానుల రాజకీయం నడుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తీరుతామని ప్రభుత్వం తెగేసి చెప్తోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈరోజు కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభ జరగనుంది. వైసీపీ మద్దతుతో ఈ సభను నాన్ పొలిటికల్ జేఏసీ భారీ ఎత్తున నిర్వహించనుంది. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ బహిరంగ సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. […]
Team India: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. ఇటీవల పంత్ ఫామ్ దృష్ట్యా అతడిని ఈ సిరీస్ నుంచి దూరం చేస్తారని మొదట్నుంచీ డిస్కషన్ నడుస్తూనే ఉంది. అయితే తొలి వన్డేలో పంత్‌ను పక్కనపెట్టడంపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ గాయపడ్డాడని, మెడికల్ టీమ్ సూచనలతో అతన్ని వన్డే సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ పేర్కొంది. టెస్ట్ సిరీస్‌కు మాత్రం పంత్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ వివరించింది. […]
YSRCP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కుటుంబంలో ఆస్తి గొడవలు నెలకొన్నాయి. అయితే ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి తన బావమరిది శ్రీధర్‌రెడ్డితో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. అయితే బావ, బావమరిది మధ్యలో మామ ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యే మామ వెంకటరమణారెడ్డి తన అల్లుడికి మద్దతుగా నిలబడ్డారు. ఆస్తి కోసం కొడుకు శ్రీధర్ రెడ్డి తనపై హత్యాయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మారణాయుధాలతో […]
CM Jagan: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆమె విజయవాడ చేరుకోగా గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడ పోరంకిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌరసన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం గొప్ప విషయం అన్నారు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న ముర్ము జీవితం […]
Hyper Aadi: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకడు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో పాటు అదిరిపోయే సెటైర్లతో అతడు హంగామా చేస్తుంటాడు. ప్రతి స్కిట్‌లో కూడా కావాలనే లవ్, మ్యారేజ్ లాంటి అంశాలను జొప్పిస్తుంటాడు. హైపర్ ఆది వేసే పంచులు, కామెడీ టైమింగ్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బుల్లితెర ఆడియన్స్ అతడిని బాగా ఇష్టపడతారు. హైపర్ ఆది ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని ఎలాంటి సమాచారం కూడా లేదు. […]