Viral News: అదిరిపోయే జాబ్ ఆఫర్.. ఎలుకలను పట్టుకుంటే రూ.1.38 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు జాబ్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని జాబ్ ఆఫర్లు విచిత్రంగా ఉంటాయని చెప్పడానికి ఈ వార్తే నిదర్శనం. అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇచ్చిన జాబ్ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎలుకలు పట్టేందుకు ఆయన ఓ కొత్త పోస్టు సృష్టించారు. ఈ జాబ్ ఆఫర్ ద్వారా ఏడాదికి రూ.1.38 కోట్ల శాలరీ ఇస్తామని ప్రకటించారు. ఈ వివరాలను ఆడమ్స్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఎలుకలు అంటే తనకు అసహ్యమని ఆడమ్స్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘న్యూయార్క్ నగరంలో కనికరం లేని ఎలుకలపై పోరాడే శక్తి మీకు ఉందా? మీరు ఎలుకలను చాకచక్యంగా పట్టుకోగలరా? అయితే, మీ కలల ఉద్యోగం రెడీగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
Read Also: Sundar Pichai: గూగుల్ సీఈఓకి పద్మభూషణ్..
Also Read
ఈ ఉద్యోగాన్ని డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్ అని పిలుస్తారని న్యూయార్క్ మేయర్ ఆఫీస్ ప్రకటన చేసింది. ఏడాదికి 170 వేల డాలర్ల వేతనం ఉంటుందని తెలిపింది. ఎలుకలను పట్టుకొనే సామర్థ్యం, దీర్ఘదృష్టి గల నాయకత్వ లక్షణాలు, సత్తువ ఉండాలని సూచించింది. ఈ ఉద్యోగంలో చేరిన వారు ఎలుకలను లేకుండా చేసేందుకు తగిన వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. సక్రమంగా విధులు నిర్వహిస్తే 8.8 మిలియన్ న్యూయార్క్ వాసులను సంతోషంగా ఉంచగలుగుతారని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా నగరంలో పరిశుభ్రత కూడా పెరుగుతుందని తెలిపారు. ఈ ఉద్యోగం పట్ల ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!