IND Vs BAN: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి పోరుకు టీమిండియా సిద్ధమైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఆదివారం మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఈ మ్యాచ్ ద్వారా కుల్‌దీప్ సేన్‌ను బరిలోకి దించుతోంది. అటు పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ను పక్కన పెట్టిన టీమిండియా వికెట్ కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. Read Also: కుర్రాళ్లకు కేక […]
Bar Code: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మందులకు అడ్డుకట్ట వేసేందుకు ఔషధాలపై బార్ కోడ్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో 300 డ్రగ్ ఫార్ములేషన్స్‌పై కంపెనీలు బార్ కోడ్ కచ్చితంగా ముద్రించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం 2023 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ బార్ కోడ్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్, అడ్రస్ తేదీ, బ్యాచ్ నంబర్, డ్రగ్ జనరిక్ పేరు, కంపెనీ పేరు, గడువు తేదీ వివరాలను కంపెనీలు పేర్కొనాల్సి ఉంటుంది. […]
Stunt Master: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తమిళ సినిమా ‘విడుదలై’ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. చెన్నై శివారులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ స్టంట్ మాస్టర్ సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్‌లో భాగంగా తాడుకు వేలాడుతున్న స్టంట్ మాస్టర్ సురేష్ తాడు తెగిపోవడంతో కింద పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ ఘటన చెన్నైకి సమీపంలోని కేలంబక్కంలో చోటు చేసుకుంది. Read Also: Pawan Kalyan: సుజిత్ దర్శకత్వంలో […]
Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్న ఆయన హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊపేశారు. సాహో ఫేం దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నారు. తొలుత ఈ కాంబినేషన్ పుకారు అని పవన్ అభిమానులు భావించారు. కానీ ఈ సినిమాపై ఆర్.ఆర్.ఆర్ సినిమా […]
Text Message: ఇప్పుడు అంతా స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది. మొబైల్ లేనిదే ఎలాంటి పని జరగడం లేదు. అందరూ ఆన్‌లైన్‌లోనే చాటింగ్ చేసుకుంటూ పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ విస్తరణతో వాట్సాప్ మెసేజ్‌లు, మెసేంజర్ నుంచి మెసేజ్‌లు పంపుతున్నాం. అయితే పూర్వం ఇంటర్నెట్ లేకుండానే మెసేజ్‌లను మాములుగా పంపేవాళ్లం. ఈ మెసేజ్ ప్రారంభమై 30 ఏళ్లు గడిచిపోయాయి. యూకేలోని బెర్క్‌షైర్‌కు చెందిన ఇంజినీర్నీల్పాప్వర్త్ 1992 డిసెంబర్ 3న తొలిసారిగా ఓ ఎస్ఎంఎస్ చేశాడు. వొడాఫోన్ నెట్‌వర్క్ ద్వారా కంప్యూటర్ […]
South Central Railway: దేశంలో అనేక ప్రాంతాల్లో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పట్టాలెక్కనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అధికారిక సమాచారం అందింది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా వందేభారత్ రైలును కేటాయిస్తూ స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో వయా కాజీపేట మీదుగా ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రైలును ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు […]
IND Vs BAN: ఇటీవల న్యూజిలాండ్ పర్యటనను ముగించుకుని బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. నేటి నుంచి బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఢాకా వేదికగా ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌తో జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్‌లో ఆడనున్నారు. దీంతో సీనియర్, […]
What’s Today: • నేడు ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు.. బరిలో 1,349 మంది అభ్యర్థులు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్.. డిసెంబర్ 7న కౌంటింగ్ • నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. విశాఖలో నేవీ డే ఉత్సవాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి • విజయవాడ: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ, గూడ్స్ వాహనాలకు అనుమతి నిరాకరణ.. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 […]
Gudivada Amarnath: ఏపీలో పెట్టుబడులపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. టీడీపీని అధికారంలోకి తేవాలని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆ వార్తలు సిరాతో రాసినవి కాదని.. సారా తాగి చంద్రబాబు కోసం రాసిన వార్తలు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమర్ రాజా సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో రూ.9500 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ చేసుకున్నారని.. ఆ సంస్థను […]
Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కోలుకున్నాడు. శుక్రవారం నాడు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా కామెంటరీ చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో పాంటింగ్‌ను ఆసుప్రతికి తరలించారు. దీంతో అతని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. గుండెపోటు వచ్చిందనే వార్తలు రావడంతో మరింత కంగారుపడ్డారు. అయితే ప్రస్తుతం పాంటింగ్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. శనివారం అతడు మళ్లీ మైదానంలోకి దిగి కామెంటరీ మొదలుపెట్టాడు. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ […]