ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=OtgdpAEEWTQ
Andhra Pradesh: కాకినాడ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి కూడా మరణించాడు. మొత్తం ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కంటైనర్‌ను కత్తిపూడి వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ డివైడర్ మీద నుంచి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. […]
IND Vs BAN: ఈనెల 4 నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ టస్కిన్ అహ్మద్ వెన్నునొప్పి కారణంగా తొలివన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ మిన్‌హజుల్ అబెడిన్ తెలిపాడు. అతడి గాయం పురోగతిని బట్టి మిగతా మ్యాచ్‌లు ఆడటంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. మరోవైపు ఈ […]
What’s Today: • నేటి నుంచి కడప జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న జగన్.. • విశాఖలో నేవీ డే వేడుకలకు సర్వం సిద్ధం.. నేడు ఫైనల్ రిహార్సల్స్.. ఎల్లుండి విశాఖ రానున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము • విజయనగరం: నేడు జడ్పీ స్థాయి సంఘాల సమావేశం.. ఉమ్మడి జిల్లాలోని శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం • నంద్యాల: నేడు […]
Vehicles Scam: బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిగిన కేసులో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీకి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డికి చెందిన రూ.22.10 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. స్క్రాప్ […]
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువస్తామని మంగళవారం ప్రకటించింది. బోధనేతర పనుల వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారని ఇటీవల ప్రభుత్వ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే వచ్చే ఎన్నికల్లో టీచర్ల స్థానంలో ఎవరు విధులు నిర్వహిస్తారని అందరి మదిలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత […]
CM Jagan: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జగనన్న విద్యా దీవెన నాలుగో విడత కింద తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కిరూ.694 కోట్ల నగదును సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయనా మాట్లాడుతూ.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అన్నారు. పేదరికం చదవుతోనే దూరమవుతుందని.. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేశారని తెలిపారు. కానీ టీడీపీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని […]
TDP Vs YCP: ఏపీలో టీడీపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాదుడే బాదుడు తరహాలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ మేరకు ఏలూరు జిల్లాలో బుధవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు ముందే వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఏలూరు జిల్లాలో టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా […]
IND Vs NZ: క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తడబడింది. సిరీస్ సమం కావాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ధావన్ సేన 47.3 ఓవర్లలో 219 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సుందర్ రాణించకపోతే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. అతడు 51 పరుగులతో రాణించాడు. సుందర్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు ఓపెనర్లు ధావన్ (28), గిల్ (13) విఫలమయ్యారు. […]
Perni Nani: బందరు పోర్టు నిర్మాణంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. బందరు పోర్టు కృష్ణా జిల్లా వాసుల చిరకాల వాంఛ అని.. 18 ఏళ్ళ నుంచి తమ కల సాకారం కాకపోవటం జిల్లా వాసులు చేసుకున్న దురదృష్టమని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వల్లే పోర్ట్ నిర్మాణం ఆలస్యమైందని వివరించారు. పోర్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న కాంట్రాక్టర్‌ను జగన్ రద్దు చేశారని.. న్యాయపరమైన చిక్కుల వల్ల మరో […]