హైదరాబాద్ నగరంలో మరోసారి మందుబాబులు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరొకరు బలయ్యారు. గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ ముందు జరిగిన రోడ్డుప్రమాదంలో ఐటీ ఉద్యోగి నితిన్ మృతి చెందాడు. ఈరోజు తెల్లవారుజామున సైకిల్ తొక్కేందుకు నితిన్ బయటకు వచ్చిన సమయంలో మద్యం మత్తులో కారుతో వెనుక నుంచి శశాంక్ అనే వ్యక్తి ఢీ కొట్టాడు.
Read Also: తెలంగాణలో మద్యం అమ్మకాలు.. సరికొత్త రికార్డు
ఈ ప్రమాదంలో నితిన్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా… చికిత్స పొందుతూ నితిన్ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన శశాంక్ ఎయిర్‌లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదం అనంతరం నిందితుడు శశాంక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో శశాంక్‌కు 120 పాయింట్లు వచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. కాగా జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 50 మంది పట్టుబడ్డారు. 40 బైకులు, 7 కార్లు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు.