కొత్త సంవత్సరం సందర్భంగా తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించినా మందుబాబులు మాత్రం పెడచెవిన పెట్టారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 50 మంది పట్టుబడ్డారు. 40 బైక్‌లు, ఏడు కార్లు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్ ప్రారంభం
రాజేంద్రనగర్ ప్రాంతంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 92 మంది పట్టుబడ్డారు. దీంతో 92 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కు సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహరించకుండా ఓ యువతి హల్‌చల్ చేసింది. పోలీసులతో పాటు తోటి ప్రయాణికులను దుర్భాషలాడుతూ సదరు యువతి రెచ్చిపోయింది. దీంతో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు.