నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల గుండెపోటుకు గురికావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.
Read Also: డప్పుతో దరువేసిన ఎమ్మెల్యే… ఎవరో తెలుసా?
తాను ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని వీడియోలో ఎమ్మెల్యే మేకపాటి తెలిపారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, అభిమానులెవ్వరూ ఆందోళన చెందొద్దన్నారు. వైద్యుల సలహా మేరకు 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందన్నారు. మరో 10 రోజుల్లో అభిమానులను కలుస్తానని.. సంక్రాంతి శుభాకాంక్షలు చెపుతానని తెలిపారు. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.