దూకుడుగా బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్న క్రిస్ గేల్‌కు వెస్టిండీస్ బోర్డు షాకిచ్చింది. కెరీర్‌లో తన చివరి టీ20 మ్యాచ్‌ను సొంతగడ్డపై ఆడాలని గేల్ భావించాడు. ఈ విషయాన్ని వెస్టిండీస్ బోర్డుతో కూడా పంచుకున్నాడు. అయితే త్వరలో సొంతగడ్డపై ఇంగ్లండ్, ఐర్లాండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌లకు వెస్టిండీస్ సెలక్టర్లు తాజాగా జట్టును ప్రకటించగా అందులో గేల్ పేరు లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
Read Also: క్రీడాభిమానులకు శుభవార్త… అమెజాన్ ప్రైమ్‌లో క్రికెట్ లైవ్
గేల్ కోరికను వెస్టిండీస్ బోర్డు బేఖాతరు చేసినట్లు అర్ధమవుతోంది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా గేల్ మాట్లాడుతూ… తన సొంత మైదానమైన సబీనా పార్కులో తన చివరి టీ20 మ్యాచ్ ఆడి అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్తానని ప్రకటించాడు. అయితే విండీస్ బోర్డు టీ20 జట్టులో స్థానం కల్పించకపోవడంతో గేల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో గేల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.