త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీ మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఓ నూతన పథకాన్ని ప్రకటించింది.
Read Also: ఒమిక్రాన్‌కు ఉచిత పరీక్ష… లింక్ క్లిక్ చేస్తే
రాష్ట్రంలో 10వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా ఉచితంగా ట్యాబ్స్ అందిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు ఈ పథకం ప్రారంభం సందర్భంగా 100 మంది బాలికలకు ఉచితంగా ట్యాబ్స్ అందజేశారు. మిగతా లబ్ధిదారులకు ట్యాబ్స్ కొనుగోలు కోసం బ్యాంకు అకౌంట్లలో రూ.12వేలు జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద 2.65 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నట్లు వారు వెల్లడించారు. ఇప్పటికే 1.59 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.12వేలు నగదు జమ చేశామన్నారు.
