ప్రధాని మోదీ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని.. పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారని.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం అదనంగా ఎఫ్ఆర్‌బీఎం ఇస్తామంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏపీ ఒప్పుకుందని.. తెలంగాణ ఒప్పుకోలేదని కేసీఆర్ తెలిపారు. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ […]
తెలంగాణలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ఆశావర్కర్లకు మొబైల్స్ ఆందించే రాష్ట్ర స్థాయి కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. […]
బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో క్రికెటర్లపై ఫ్రాంఛైజీలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. వేలంలో శనివారం నాడు ఏకంగా 10 మంది ఆటగాళ్లు రూ.10 కోట్లుపైన ధర పలికారు. ఆదివారం కూడా ఆటగాళ్ల వేలం జోరుగా సాగుతోంది. ఈ మేరకు తెలుగు ప్లేయర్ ఐపీఎల్ మెగా వేలంలో ఎంపికయ్యాడు. నెల్లూరు జిల్లాకు చెందిన అశ్విన్ హెబ్బార్‌ను నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అశ్విన్ హెబ్బార్ 2015 నుంచి రంజీల్లో […]
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో వైభవంగా జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు పాల్గొన్నారు. ఈ మేరకు సమతా మూర్తి విగ్రహాన్ని వారు దర్శించుకున్నారు. అనంతరం శ్రీరామనగరంలో కొలువై ఉన్న 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఈ […]
ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఐపీఎల్ మెగా వేలంలో జాక్‌పాట్ తగిలింది. అండర్-19 టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. అటు ఆల్‌రౌండర్ రాజ్ బవాను పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. రాజ్ బవా మీడియం పేస్ బౌలింగ్ వేయగలడు. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో పరిస్థితులకు అనుకూలంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అందుకే పంజాబ్ కింగ్స్ అతడిని రూ.2 కోట్లకు దక్కించుకుంది. అండర్-19 […]
ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ప్రేమజంటలకు శివసేన కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. వాలంటైన్స్‌డే రోజు ఎవరైనా పార్కుల్లో జంటలుగా కనిపిస్తే.. చితక్కొడతామని స్పష్టం చేశారు. వాలెంటైన్స్‌డే సందర్భంగా తాము వివిధ ప్రాంతాల్లో కర్రలను చేతబూని తిరుగుతామని, ఏ జంటలైనా కనిపించాయో.. వారికి అక్కడికక్కడే పెళ్లి చేసేస్తామని శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం నాడు భోపాల్‌లో శివసేన కార్యకర్తలు కర్రలు చేతబూని వాటికి కాళికా దేవి మందిరంలో పూజలు కూడా నిర్వహించారు. […]
బెంగళూరులో ఐపీఎల్ వేలం కొనసాగుతోంది. రెండోరోజు వేలంలో ఇప్పటివరకు చూసుకుంటే.. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్ రౌండర్ లివింగ్‌స్టోన్ అత్యధిక ధర పలికాడు. లివింగ్ స్టోన్ కనీస ధర రూ.కోటి కాగా… పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా అతడిని రూ.11.5 కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసింది. లివింగ్ స్టోన్ హిట్టర్ కావడంతో అతడిని దక్కించుకునేందుకు పంజాబ్ కింగ్స్ జట్టు పోటీ పడింది. అతడు బంతితోనేగాక బ్యాట్‌తోనూ ఆటను మలుపు తిప్పగలడు. బంతితో సమర్థంగా ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ […]
ఏపీ రాజధాని అమరావతిలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ భవనాలే టార్గెట్‌గా దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. ఈ మేరకు నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల్లో విలువైన సామాన్లను దొంగలు దోచుకెళ్తున్నారు. సచివాలయం, అసెంబ్లీ పక్కనే రూ.110 కోట్లతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో దొంగలు ప్రవేశించి విలువైన ఏసీలు, ఎల్‌ఈడీ లైట్లతో పాటు కరెంట్ వైర్లు, విలువైన ఎలక్ట్రికల్ సామాగ్రిని దోచుకుపోతున్నారు. ఆయా ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు కొంతకాలంగా నిలిచిపోవడంతో దొంగలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్మాణాలలో […]
ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ ఏడాది సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ జన్మదిన సంబరాలను మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించుకుందామని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేలా ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ సూచించారు. […]