KCR: సీఎం కేసీఆర్ బర్త్ డే.. టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ ఏడాది సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ జన్మదిన సంబరాలను మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించుకుందామని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేలా ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ సూచించారు.
కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈనెల 15న తెలంగాణ వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథశ్రమాలు వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహారం పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈనెల 16న అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. ఈనెల 17న కేసీఆర్ జన్మదినం రోజు రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇవే కాకుండా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చని కేటీఆర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
Also Read
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!