టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ గత శుక్రవారం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ తెలుగులో పంపిణీ చేసింది. ఈ చిత్రానికి మాస్ మహరాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాకు తమిళంలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, తెలుగులోనూ ఆదరణ బాగుందని విష్ణు విశాల్ మంగళవారం మీడియాతో తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ తర్వాత థియేటర్ల ఓనర్స్, పంపిణీ దారులు ఈ […]
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దొంగే దొంగ అంటే ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు ఉంటాడని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదానే కావాలని ఉద్యమం చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. జీవీఎల్ నరసింహారావు పక్క రాష్ట్రంలో ఎంపీ పదవి తెచ్చుకున్న వ్యక్తి అని.. పదిహేను రోజులకు […]
తెలంగాణలో బుధవారం నుంచి మేడారం జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా అడవి తల్లి బిడ్డలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. బుధవారం మొదలవుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక విశిష్టతకు నిలువెత్తు నిదర్శనం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ దేవతలు అడవి బిడ్డల వీరత్వానికి ప్రతీకలు అని అభివర్ణించారు. దేశం నలుమూలల ఉన్న గిరిజనులు, గిరిజనేతరులు తమ ఇలవేల్పులుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణీల […]
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పిలుపు మేరకే తాను ఈరోజు ఆయనతో సమావేశం అయ్యానని తెలిపారు. పదవుల కోసం రాలేదని స్పష్టం చేశారు. అయితే త్వరలో పార్టీ ఆఫీసు నుంచి తనకు సంబంధించి ప్రకటన ఉంటుందని అలీ తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో తనకు పాత పరిచయం ఉందని.. వైసీపీ పార్టీ కోసం తాను కష్టపడి […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రధాని, జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ఫోన్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు కేసీఆర్‌ను దేవెగౌడ అభినందించారు. దేశాన్ని కాపాడుకునేందుకు తమ వంతుగా సంపూర్ణ సహకారం అందిస్తామని.. కేసీఆర్ పోరాటం కొనసాగించాలని దేవెగౌడ ఆకాంక్షించారు. కాగా తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని దేవేగౌడకు సీఎం కేసీఆర్ తెలిపారు. కాగా హుజురాబాద్ […]
అమరావతి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ రంగ సమస్యలపై జగన్‌తో చాలా విషయాలు చర్చించానని.. కానీ అవి ఇప్పుడు చెప్పనని.. సరైన వేదికపై మాట్లాడతానని తెలిపారు. విశాఖకు సినీ ఇండస్ట్రీని తరలించే విషయంపై అందరం సమావేశమై చర్చిస్తామని మంచు విష్ణు పేర్కొన్నారు. జగన్ తనకు వరుసకు బావ అయినా అన్న అని పిలుస్తానని ఆయన చెప్పారు. అటు […]
ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం అసలు ప్రస్తుతం ప్రస్తావనలో లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. రెవిన్యూ డెఫిషిట్ గ్రాంట్ ఏపీకి ఎప్పటికప్పుడు ఇస్తున్నామని జీవీఎల్ తెలిపారు. ఏపీ అభివృద్ధిపై నిరంతరం శ్రద్ధ వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లాను విస్మరించిందని.. వెలిగొండ విషయంలో ప్రస్తుత, గత ప్రభుత్వాలు […]
పోలీస్ శాఖలో ఏపీ ప్రభుత్వం కీలక బదిలీలను చేపట్టింది. ఇప్పటికే ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను తప్పించిన ప్రభుత్వం… తాజాగా కడప జైలు ఇంఛార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డిని కూడా బదిలీ చేసింది. వరుణారెడ్డి ఒంగోలు జైలర్‌గా బదిలీ అయ్యారు. ఒంగోలు జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రకాష్‌ను కడప జైలర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల వరుణారెడ్డి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. గతంలో పరిటాల హత్య కేసు నిందితుడు మొద్దు […]