మేడారం భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మేడారం జాతర వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈనెల 13 నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందిస్తామని తెలిపింది. ఈ మేరకు గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తులను హెలికాప్టర్ ద్వారా మేడారం తీసుకువెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ […]
ఈరోజు ఐపీఎల్-15వ సీజన్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు రూ.560 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ వేలంలో తొలి ప్రాధాన్య సెట్‌లోని తొలి లాట్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా బయటకు వచ్చింది. వీరంతా రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పలుకుతుండటం విశేషం. ఈ జాబితాలో […]
దేశంలో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్నిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,407 కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,25,86,544కి చేరింది. అయితే కరోనా మరణాలు మాత్రం నిలకడగా నమోదవుతున్నాయి. కొత్తగా 804 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,07,981కి పెరిగింది. అటు […]
2014, మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలో ఈ వేడుకలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళగిరి మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండు స్థలాలను జనసేన నేత నాదెండ్ల మనోహర్ శుక్రవారం నాడు పరిశీలించారు. Read Also: Andhra Pradesh: ఏపీలో మార్చి […]
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 15-17 మధ్య జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వర్తిస్తారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులు, అధికారులను కేటాయించడం, మౌలిక వసతుల కల్పన, ఇతర చర్యలు పూర్తయ్యేంత వరకు […]
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ సేవలు ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు ట్విట్టర్‌లో ట్వీట్లు చేయడానికి యూజర్లు నానా అవస్థలు పడ్డారు. మొబైల్ మాత్రమే కాదు వెబ్‌సైట్‌లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్యతోపాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని, లాగిన్ కూడా కాలేకపోయామని యూజర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే లాగౌట్ అయిందని పలువురు వాపోయారు. ట్విట్టర్ […]
హైదరాబాద్ శంషాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించిన రాందేవ్ బాబా.. చినజీయర్ స్వామిపై ప్రశంసలు కురిపించారు. రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసిన చినజీయర్‌స్వామి చరిత్రలో నిలిచిపోతారని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. భారత వాస్తు, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకునేవారు కచ్చితంగా రామానుజాచార్యుల దివ్యక్షేత్రాన్ని సందర్శించాలని సూచించారు. తాను వీలైనన్నిసార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటానని రాందేవ్ బాబా చెప్పారు. అటు భారతీయ సంస్కృతిలో అసమానత, అన్యాయం ఉందని కొందరు పదేపదే వాదిస్తుంటారని.. సనాతన ధర్మంపై […]
సారథిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి వన్డే సిరీస్‌లోనే రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌లో వన్డేల్లో విండీస్‌ను వైట్‌వాష్ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. తన తొలి వన్డే సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును అధిగమించాడు. రోహిత్ ఇప్పటివరకు 13 వన్డేలకు కెప్టెన్సీ వహించగా 11 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. దీంతో ఇండియా తరఫున కోహ్లీ నెలకొల్పిన […]
సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి హడావిడిగా అరెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును శుక్రవారం అర్ధరాత్రి బెయిల్‌పై విడుదల చేశారు. సుమారు 18 గంటల పాటు సీఐడీ పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అనంతరం పోలీసులు విజయవాడ కోర్టుకు తరలించారు. సీఐడీ కోర్టు ఇంఛార్జి న్యాయమూర్తి సత్యవతి బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో అశోక్‌బాబును పోలీసులు విడుదల చేశారు. ఆయనకు రూ.20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు […]