తెలంగాణలో బుధవారం నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. ఒకప్పుడు ఆదివాసీలు, గ్రామీణులు మాత్రమే ఈ జాతరలో పాల్గొనే వారు. ఈ జాతరకు రెండు దశాబ్దాల క్రితం వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎడ్ల బండ్లలో తరలి వెళ్లేవారు. కాల క్రమేణా జంపన్న వాగు పై బ్రిడ్జి నిర్మాణం అనంతరం ఎడ్ల బండ్లపై వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారి సంఖ్య అధికమైంది. 2012లో మొదటి సారిగా హెలికాప్టర్ ద్వారా రాకపోకలను […]
ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు ప్రజలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ హామీలిచ్చే పనిలో పడ్డాయి. తాజాగా యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కొత్త హామీని ప్రకటించింది. మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు ఉచిత రేషన్‌తో పాటు పేదలకు కిలో నెయ్యి ఇస్తామని ప్రకటించారు. పేదల […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఫిబ్రవరి 25న థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమాలో రానా విలన్‌గా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిమానులకు ఫీస్ట్ అందించనున్నాడు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ […]
అమరావతి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను నందమూరి కుటుంబసభ్యులు కలిశారు. అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు పేరు పెడతానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నందుకు నందమూరి కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో మంత్రి కొడాలి నానితో పాటు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, నందమూరి పెద వెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య, చిగురుపాటి మురళి, పలువురు స్ధానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వారు జ్ఞాపికను […]
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పాలకుర్తి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మార్చి తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అంచాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎర్రబెల్లి ప్రకటించారు. దాని కోసం సాధ్యాసాధ్యాలను కేసీఆర్ పరిశీలిస్తున్నారని తెలిపారు. అటు దళిత […]
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య సీఎం జగన్‌ను ఎంతో కుంగదీసిందని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యపై కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. సీబీఐ ఛార్జ్‌షీట్ పేరుతో కేసుతో సంబంధం లేని వారిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ […]
ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు మధ్యాహ్నం వరకు విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బాధ్యతల నుంచి తప్పించడం తనకు విస్మయం కలిగించిందన్నారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావొచ్చు… కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరమేంటని పవన్ ప్రశ్నించారు. గౌతమ్ సవాంగ్ బదిలీపై గల కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష గురించి మాట్లాడే హక్కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేదని హరీష్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుతున్న భాషనే కేసీఆర్ ఈరోజు మాట్లాడుతున్నారని.. తెలంగాణ ప్రజల భాషనే కేసీఆర్ మాట్లాడతారని తెలిపారు. బీజేపీ నేతలదే మతాల మధ్య చిచ్చు పెట్టేలా భాష అని ఆరోపించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీని కూకటివేళ్లతో కదిలించి తెలంగాణను సాధించారని హరీష్‌రావు […]
ఈనెలాఖరులో భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటించనుంది. ఈ మేరకు టీమిండియాతో మూడు టీ20లతో పాటు రెండు టెస్టులను శ్రీలంక ఆడనుంది. అయితే తొలుత షెడ్యూల్ ప్రకారం తొలుత టెస్టులు, తర్వాత టీ20లు జరగాల్సి ఉంది. కానీ సవరించిన షెడ్యూల్ ప్రకారం ముందుగా టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 24న తొలి టీ20, ఫిబ్రవరి 26న […]
ప్రముఖ నిర్మాతలు లగడపాటి శిరీష, శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరీ’. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వంలో శిరీషా శ్రీధర్ ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 18న సినిమా జనం ముందుకొస్తున్న నేపథ్యంలో మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘యువత కోణంలో సాగే చిత్రమిది. వాళ్ల ఆలోచనలకు ప్రతిబింబంలా ఉంటుంది. 16 ఏళ్లకు అమ్మాయి, అబ్బాయి కొత్తగా రెక్కలొచ్చినట్లు ఫీలవుతారు. యువత లైఫ్ […]