తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రధాని, జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ఫోన్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు కేసీఆర్‌ను దేవెగౌడ అభినందించారు. దేశాన్ని కాపాడుకునేందుకు తమ వంతుగా సంపూర్ణ సహకారం అందిస్తామని.. కేసీఆర్ పోరాటం కొనసాగించాలని దేవెగౌడ ఆకాంక్షించారు. కాగా తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని దేవేగౌడకు సీఎం కేసీఆర్ తెలిపారు.
కాగా హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతోంది. క్రమంగా రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పనిలో పనిగా ప్రధాని మోదీపైనా కేసీఆర్ మండిపడుతున్నారు. ఇటీవల ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మరీ రెండు గంటల పాటు బీజేపీని ఏకిపారేశారు. దేశం నుంచి బీజేపీని తరిమికొడతామని.. దేశానికి బీజేపీ చాలా ప్రమాదకరమని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.