కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు టీ20ల్లో ఇదే తొలి సిరీస్. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఐదో తరగతి విద్యార్థిని ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన గుర్రం మేఘన (9) ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె తల్లిదండ్రులు డ్రాయింగ్ నేర్చుకోవడానికి మేఘనను ప్రోత్సహించారు. అయితే మేఘనకు సీఎం కేసీఆర్ కూడా ఇష్టం ఉండటంతో సుమారు 100కు పైగా చిత్రాలను వివిధ రంగులతో డ్రాయింగ్ వేసి అందరినీ అబ్బురపరుస్తోంది. కేవలం హరితహారం పథకం గురించే […]
ఏపీలో కొత్త జిల్లాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు తాతయ్యగుంటలోని గంగమ్మను వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను తిరుపతిలో పుట్టి పెరిగానని.. అందుకే తరచూ గంగమ్మ గుడికి వస్తుంటానని రోజా తెలిపారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా గంగమ్మ జాతర జరగలేదని.. ఈ ఏడాది కచ్చితంగా అమ్మవారి జాతర ఘనంగా […]
బీజేపీపై మరోసారి మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలను పక్కనపెట్టి కార్పొరేట్ల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని హరీష్‌రావు విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చి తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ నేతలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఓటర్లను బుల్డోజర్లతో తొక్కిస్తామని రాజాసింగ్ అంటుంటే.. కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించరని సూటిగా ప్రశ్నించారు. Read Also: EC: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు.. […]
మార్చి నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో తమ జట్టును నడిపించే సారథిని కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల ముగిసిన వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతడు గతంలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే గత సీజన్‌లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. కాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఇప్పటివరకు గంగూలీ, బ్రెండన్ మెక్‌కలమ్, […]
దుబాయ్ పర్యటనలో ఏపీకి భారీ పెట్టుబడులు తీసుకువస్తున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. ఖాళీ కుర్చీలకు ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి అబుదాబి వరకూ వెళ్లాలా మేకపాటి గౌతమ్ రెడ్డి గారూ అంటూ ఎద్దేవా చేశారు. పైగా జగన్ గురించి పెద్దగా ఇక్కడ ఎవరికి తెలియదని సెలవివ్వడం మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పీచ్‌కే హైలెట్ అని లోకేష్ విమర్శలు చేశారు. చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి ఇతర రాష్ట్రాలకు […]
ఇప్పటి వరకు ద్విచక్రవాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని నిబంధనలను ప్రకటించింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్‌ను తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చిన్నారులకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఈ మేరకు ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే […]
త్వరలో ఐపీఎల్-15 ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇటీవల ఐపీఎల్ మెగా వేలం కూడా పూర్తయింది. అయితే సన్‌రైజర్స్ కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని.. ఈ మేరకు ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో అన్న అనుమానాలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందో సూచన ప్రాయంగా చెప్పేశాడు. కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్‌కు వస్తారని… ఆ […]
ఏపీలో టిక్కెట్ల ధరలపై నెలకొన్న సమస్య కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఇటీవల టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం గురువారం నాడు జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో రేపు 11:30 గంటలకు జరిగే భేటీ అనంతరం.. ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే టికెట్ ధరల ప్రతిపాదనలు సిద్ధం కాగా.. రేపు ప్రకటన వచ్చే […]
నిజామాబాద్ పర్యటనలో బీజేపీపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ నేతలు యువకులు, విద్యార్థులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీశారు. మోదీ ప్రధానిగా అధికారం చేపట్టి ఏడేళ్లు దాటుతున్నా తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులు మంజూరు చేయలేదన్నారు. బీజేపీ నేతలు విషం చిమ్మకుండా విషయాలు […]