పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, కేటీఆర్ పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడం ఈ వేడుకకు హైలెట్‌గా నిలిచిందనే చెప్పాలి. ఇక ఈ మూవీ సంగీత దర్శకుడు తమన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈ సినిమా […]
పర్యాటక ప్రియుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా తీర్థయాత్ర రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా మార్చిలో ఉత్తర భారత యాత్రను నిర్వహిస్తోంది. రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ డీజీఎం కిషోర్ సత్య, ఏరియా మేనేజర్ కృష్ణ వెల్లడించారు. మార్చి 19న రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరి సామర్లకోట, తుని, విశాఖ మీదుగా ఉత్తర భారతమంతా ప్రయాణిస్తుందని తెలిపారు. ఉత్తర భారత యాత్ర ప్యాకేజీ 9 రోజులు, 9 రాత్రులు […]
ఏపీలో వైసీపీ అధినేత జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి నేటితో వెయ్యిరోజులు పూర్తవుతోంది. వెయ్యి రోజుల పాలనలో సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ బీమా, మనబడి నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ వాహన మిత్ర వంటి పథకాలతో […]
యూపీలోని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పిల్లలను దత్తత తీసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం సింగిల్ పేరెంట్ కూడా పిల్లలను దత్తత తీసుకోవచ్చని తెలిపింది. యూపీలోని వారణాసికి చెందిన ట్రాన్స్‌జెండర్ 2000 డిసెంబర్ 16న ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ జంట తాజాగా ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో సంబంధిత అధికారులను సంప్రదించగా.. వాళ్లు వివాహ […]
ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీగా మ్యాచ్‌లు ఆడబోతోంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఆడిన భారత్.. గురువారం నుంచి శ్రీలంకతో తలపడనుంది. అనంతరం ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ ముగిశాక కూడా టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి ఉండదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అర్ధంతరంగా రద్దయిన టెస్టును […]
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం తారా స్థాయికి చేరింది. అమెరికా ఆశపడ్డట్టు ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యక్ష దాడి చేయలేదు. కానీ, అంతకు మించిన షాక్ ఇచ్చింది ప్రపంచ పెద్దన్నకు. పుతిన్ దురాక్రమణకు దిగాడని అమెరికా గగ్గోలు పెడుతోంది. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని ప్రెసిడెంట్ బైడెన్ ఆరోపించారు. ఆంక్షల పర్వానికీ అమెరికా తెరలేపింది. రష్యాకు చెందిన ఆర్థిక సంస్థలు వీఈబీ, రష్యా మిలిటరీ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. అలాగే అక్కడి ఉన్నత వర్గాలు, వారి కుటుంబాలపై కూడా ఆంక్షలు పెట్టనుంది. […]
తమిళనాడులో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వెల్లూరు నుంచి 37వ వార్డుగా పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ విజయకేతనం ఎగురవేశారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గంగానాయక్ సామాజిక కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దక్షిణ భారత ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. కాగా ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తుండటం […]
వెస్టిండీస్ గడ్డపై ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొట్టింది. ఫైనల్‌లో క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. అయితే వెస్టిండీస్‌లో ఏడుగురు అండర్ 19 టీమిండియా ఆటగాళ్లకు అవమానం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లను అధికారులు అడ్డుకున్నారని.. 18 ఏళ్లు నిండని వారికి భారత్‌లో వ్యాక్సినేషన్ ఇంకా ప్రారంభించలేదని వివరణ ఇచ్చినా అధికారులు వినిపించుకోలేదని టీమిండియా మేనేజర్ […]
కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్‌లు విద్యావ్యవస్థలో గందరగోళానికి గురిచేస్తాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తరహా పిటిషన్‌లు విద్యార్థులను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో క్లాసులు సరిగ్గా జరగని కారణంగా సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు టెన్త్, ఇంటర్ […]