గురువారం నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు ముందే టీమిండియాకు షాక్ తగిలింది. అద్భుత ఫామ్‌లో ఉన్న కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ గాయపడినట్లు జట్టు వర్గాలు చెప్తున్నాయి. దీంతో అతడు శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటాడని.. అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాయి. కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ మ్యాన్ ఆఫ్ […]
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్తగా కనిపించనుంది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా.. అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్ సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్ వ్యవహరించనున్నట్లు సమాచారం. వీరిద్దరి పేర్లను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి రికీపాంటింగ్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. పాంటింగ్, వాట్సన్ ఇద్దరూ ఆస్ట్రేలియా ఆటగాళ్లే కావడంతో వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో కోచ్, అసిస్టెంట్ కోచ్ పాత్రల్లో పాంటింగ్, వాట్సన్ […]
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ బుధవారం నాడు జాతికి అంకితం చేశారు. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ… తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టే కాళేశ్వరం అని పేర్కొన్నారు. దేశమంతా కరవు వచ్చినా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు మాత్రం రాదని కేసీఆర్ అన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరం కల సాకారమైందన్నారు. ఈ ప్రాజెక్టు ఆపేందుకు చాలా మంది ఎన్నో కేసులు వేశారని.. అయినా తాము వెనక్కి […]
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాష్ట్రపతి ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీలలో ప్రస్తుతం బీజేపీకి గణనీయమైన బలం ఉంది. కాబట్టి పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో బీజేపీకి తిరిగి అధికారం దక్కుతుందో లేదో తెలియదు. ఒకవేళ గెలిచినా ఎన్ని సీట్లు వచ్చాయనేదిముఖ్యం. ఎందుకంటే బొటా బొటి మెజార్టీతో ఆయా రాష్ట్రాలలో అధికారం తిరిగి చేజిక్కించుకుంటే రాజ్యసభలో బీజేపీ బలం తగ్గుతుంది. లోక్‌సభలో పూర్తి మెజార్టీ […]
ప్రస్తుతం టీమిండియాలో వృద్ధిమాన్ సాహా వివాదం హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంకతో సిరీస్‌కు సాహాను సెలక్టర్లు పక్కన పెట్టగా… అతడి ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్టు బెదిరించడం రచ్చ రేపుతోంది. దీనిపై బీసీసీఐ రంగంలోకి దిగిందని.. దర్యాప్తు చేపట్టిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదంపై సాహా స్వయంగా స్పందించాడు. ఇప్పటివరకు తనను బీసీసీఐ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ తనను సంప్రదించినా.. బెదిరించిన జర్నలిస్టు పేరును బీసీసీఐకి చెప్పదలుచుకోలేదని వివరించాడు. తాను ఒకరి కెరీర్ నాశనం […]
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారత్ భారతి భాషా మహోత్సవ్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే అందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మన మూలాలు, సంస్కృతిని తెలియజెప్పి ముందుకు నడిపించే సారథే భాష అని పేర్కొన్నారు. భాష అనేది మన అస్థిత్వాన్ని చెప్పడమే కాకుండా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. తరతరాలుగా మన పూర్వీకులు మన సంస్కృతిని మన భాషలోనే […]
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరంలో ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడటం, ఆయన ముంబై పర్యటన, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో గంటసేపు లంచ్ మీటింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో మాటా మంతీ జరిపారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కేసీఆర్ జాతీయ ఆకాంక్షలు ఎంతవరకు ఫలిస్తాయి? ప్రాంతీయ పార్టీలు ఏకం కావటం సాధ్యమా? జాతీయ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించాలన్న తన […]
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఈ నెల 18న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో చేసిన వ్యాఖ్యలపై రాజమండ్రి ఎంపీ భరత్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సీరియస్ అయ్యారు. సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టి, విద్వేషాలు రగిలించారని నల్లజర్ల వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కండెపు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అయ్యన్నపాత్రుడిపై సెక్షన్ 506, […]
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ 10న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ […]