టీమిండియాకు అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నా విరాట్ కోహ్లీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 2022 జనవరి నెలకు సంబంధించి భారత్‌లో పాపులర్ ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మేరకు ఓర్మాక్స్ మీడియా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కోహ్లీ తొలి స్థానంలో ఉండగా.. మాజీ ఆటగాడు ధోనీ రెండో స్థానంలో ఉండటం విశేషం. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక […]
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో దాదాపు 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జోనల్ విధానంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వీటిని భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల్లో 1,250 పైగా జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా.. భాషా పండితులు, పీఈటీలు కలిపి మరో 1,200 ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి. […]
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల తహసీల్దార్ కృష్ణమూర్తి ఓ మహిళా ఎస్సైపై చిందులు తొక్కారు. పనిచేతకాకపోతే గేదెలు కాచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పూసపాటిరేగ మండలం గోవిందపురం గ్రామస్థులు కందివలసగెడ్డలోని ఇసుకను లంకలపల్లి గుండా ప్రతిరోజూ ఎడ్లబండిలో తరలిస్తుంటారు. ఇసుక తరలింపు కారణంగా తమ గ్రామంలోని బోరుబావులు ఎండిపోతున్నాయని లంకలపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం ఇసుక తరలిస్తున్న ఎడ్లబండ్లను అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య వివాదం చెలరేగింది. ఈ విషయం తెలిసిన ఎస్సై […]
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలపై మాట్లాడుతూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా గురించి సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. ఒకవైపు ట్రైలర్, మరోవైపు ప్రి రిలీజ్ ఈవెంట్ గురించి తెగ చర్చ నడుస్తోంది. దీంతో భీమ్లానాయక్ ట్రైలర్‌పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత […]
ఐపీఎల్ వేలంపై టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలం ప్రక్రియను చూస్తే సంతలో పశువులను కొనుగోలు చేస్తున్న భావన కలిగిందని ఊతప్ప వ్యాఖ్యానించాడు. వస్తువుల కోసం పోటీపడుతున్నట్టుగా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయని అభిప్రాయపడ్డాడు. వేలంలో ఓ ఆటగాడిని ఏదైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే ఒకే కానీ.. ఎవరూ కొనకపోతే అతడి పరిస్థితి ఎంత బాధాకరమో ఎవరూ ఊహించలేరని ఉతప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. వేలం జరిగిన తీరు […]
పశ్చిమ ఆఫ్రికా దేశంలోని బుర్కినా ఫాసోలో విషాద ఘటన చోటు చేసుకుంది. బామ్ బ్లోరా గ్రామంలోని బంగారు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 59 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారాన్ని శుద్ధిచేసే రసాయనాల వల్లే పేలుడు సంభవించిందని సమాచారం. పేలుడు సంభవించిన వెంటనే మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయని… తొలి పేలుడు రాత్రి 2 […]
ప్రతి సంవత్సరంలో కొన్ని రోజులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇలాంటి రోజులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందుకే ఇలాంటి రోజుల కోసం చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. మరి ఇవాళ కూడా ప్రత్యేకమైన రోజే. ఈ రోజు తేదీ అయితే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు తేదీలో 2 అనే సంఖ్య ఆరు సార్లు కనిపిస్తుంది. 22వ తేదీ, రెండో నెల.. 2022 సంవత్సరం. మొత్తం కలిపి చూసుకుంటే 22.02.2022ను సూచిస్తుంది. […]
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో జారీ చేసిన జీవో 58, 59 నిబంధనలనే కొనసాగించింది. ఆక్రమిత భూములకు సంబంధించి జీవో 59 కింద రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. గతంలో ఉన్న ఆస్తి విలువలో 12.5% చెల్లించే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. మార్చి 31వ తేదీ వరకు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తును […]
తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం వచ్చేసింది. క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. సోమవారం తిరుపతిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. అనంతపురం, కర్నూలు వంటి పట్టణాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 36.6 డిగ్రీలకు చేరాయి. కడపలో 36.2, తూర్పుగోదావరి జిల్లా తునిలో 36.1, ప్రకాశం జిల్లా ఒంగోలులో 35.7, అమరావతిలో 35.2 […]
విజయ్‌దేవరకొండ, రష్మిక జంట త్వరలో వివాహం చేసుకుంటుందని బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వీటిని ఆసరా చేసుకుని తెలుగు మీడియా కూడా ఈ ఏడాదిలోనే విజయ్, రష్మిక జోడీ పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వండి వారుస్తోంది. ఇటీవల రష్మిక తన ప్రియుడు రోహిత్ శెట్టితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. ఈ జోడీ చేసింది రెండు సినిమాలే అయితే వారి కెమిస్ట్రీ ఆన్‌స్కీన్ మీద చూడముచ్చటగా ఉంటుంది. […]