ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌కు దిగుతున్నట్లు రష్యా ప్రకటించిన వెంటనే సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పేలుళ్లు జరిపాయి. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బలగాలు ఆక్రమించాయి. బోరిస్పిల్ ప్రాంతంలోనూ బాంబు దాడులు జరిగినట్టు చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లో అతిపెద్ద రెండో నగరం ఖార్కివ్‌నూ రష్యా బలగాలు టార్గెట్ చేశాయి. మరోవైపు మరియపోల్, దినిప్రో, క్రమటోర్ప్క్, ఒడెస్సా, జపోర్గియా నగరాల్లోనూ రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. […]
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగడంపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో జరిగే పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘించిందని.. రష్యా సైనిక చర్యను ఆపాలని, బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని ఆయన పేర్కొన్నారు. రష్యా దాడులకు ప్రతి చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. […]
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజలు ఉపశమనం చెందుతున్నారు. నెమ్మదిగా కరోనా ఆంక్షలు తొలగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,148 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 302 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,81,179కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,12,924గా నమోదైంది. కరోనా కేసులు తగ్గుముఖం […]
రాజధాని అమరావతిలో రైతులు ఉద్యమం ప్రారంభించి నేటితో సరిగ్గా 800 రోజులు అవుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి కోసం తాము ప్రాణ సమానమైన భూములను ప్రభుత్వానికి అప్పగించామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టడం.. పైగా మూడు రాజధానుల పేరుతో కొత్త ప్రతిపాదనలు తీసుకురావడంతో అమరావతి రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. తమకు జరిగిన అన్యాయంపై నిరంతర పోరాటం సాగిస్తున్నారు. తమ […]
శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ వాకింగ్ చేయడం తప్పనిసరి. అయితే ఏ సమయంలో వాకింగ్ చేయాలి? ఎంతసేపు చేయాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది ఫిట్‌గా ఉండాలని ఎక్కువసేపు వాకింగ్ చేస్తుంటారు. అలా చేయడం కూడా ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం ఆకలి వేస్తే మన పొట్టకి ఎంత ఆహారం సరిపడితే అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం. అలాగే వాకింగ్ కూడా అంతే. శరీరం తీరును బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. […]
ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్‌ను రష్యా ప్రకటించింది. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ దేశ చర్యల విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. ఏం జరుగుతుందో కూడా ఊహించని […]
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సీఈసీ వెల్లడించింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖను పంపింది. తమ పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్టుగా తమకు లేఖ అందినట్లు పార్టీ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్ ప్రకటించారు. తమ పార్టీని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ 28 డిసెంబరు 2020లో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశామని […]
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది, 7,218 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. తాజా పోస్టులను జిల్లా యూనిట్‌గా భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. గతంలో మండల, పట్టణ యూనిట్‌గా వాలంటీర్లను నియమించగా.. ఇప్పుడు గ్రామాల్లో 4,213, పట్టణాల్లో 3,005 వాలంటీర్ల ఖాళీల భర్తీకి జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. […]
భారత్‌లోని బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.18 వేల కోట్లు వసూలు చేసిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చింది. 2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,700 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించినట్టు తెలిపింది. అన్ని కేసుల్లో […]
శ్రీలంకతో సొంతగడ్డపై నేటి నుంచి టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అందులో భాగంగా లక్నో వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ వంటి కీలక ఆటగాళ్లు దూరమైనా ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ల సామర్థ్యాలను పరీక్షించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని […]