హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రాన్ని దర్శించాలని భావించే భక్తుల కోసం నిర్వాహకులు సందర్శన వేళలను ప్రకటించారు. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని నిర్వాహకులు తెలిపారు. సమతామూర్తి కేంద్రానికి బుధవారం సెలవు ఉంటుందన్నారు. శని, ఆదివారాల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులు సమతామూర్తిని దర్శించవచ్చని సూచించారు. మార్చి 9వ తేదీ నుంచి ఈ టైమింగ్స్ అమల్లోకి […]
ఈనెల 25న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ విడుదల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా థియేటర్ల యజమానులకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని.. బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు పలు థియేటర్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. జీవో నెంబర్ 35 ప్రకారం టిక్కెట్లు అమ్మకుంటే సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం చర్యలు […]
ఏపీలో బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. సుమారు 15 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మార్చి 7న తొలిరోజు సమావేశాల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేయనుంది. మార్చి 8న ఉభయ సభలను ఉద్దేశించి […]
★ నేడు ప్రజాదీక్ష చేపట్టనున్న అమరావతి రైతులు.. వెలగపూడిలో 24 గంటల పాటు రైతుల సామూహిక నిరాహార దీక్ష.. ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు దీక్ష.. రాజధాని ఉద్యమం 800వ రోజుకు చేరిన సందర్భంగా దీక్ష★ ఏపీలో జిల్లాల విభజనపై నేడు రెండో రోజు కలెక్టర్లతో ప్రణాళిక శాఖ సమావేశాలు.. జిల్లాల విభజనపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలపై చర్చ★ తూ.గో.: నేడు బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమం.. కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‌కు రాష్ట్ర […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. నాలుగేళ్ల క్రితం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో చిరంజీవి, రామ్‌చరణ్ పిలిచిన ఓ సినిమా ఫంక్షన్‌కు హాజరయ్యానని.. అప్పుడు మెగాస్టార్, ఆయన సోదరుడు పవర్‌స్టార్ అని మాట్లాడుతుంటే.. తనను అభిమానులు అరుపులతో మాట్లాడనివ్వలేదని.. ఇప్పుడు కూడా తనని మాట్లాడనివ్వడం లేదని కేటీఆర్ నవ్వుతూ అన్నారు. 26 ఏళ్లుగా ఒకే విధమైన స్టార్‌డమ్‌ను […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి భీమ్లా నాయక్ మూవీలో పాటలకు పర్ఫార్మ్ చేస్తూ డ్రమ్స్ వాయించారు. వీరిద్దరూ కలిసి డ్రమ్స్ వాయిస్తూ ఉండగా శివమణి వెళ్లి హీరో పవన్ కళ్యాణ్‌ను, మంత్రి కేటీఆర్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చి వారితో డ్రమ్స్ వాయించేలా చేశారు. పవన్ కళ్యాణ్, కేటీఆర్ ఇద్దరూ కూడా డప్పు వాయించారు. దీంతో […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ 24 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినప్పటి నుంచి రోజురోజుకు ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉందని తలసాని వ్యాఖ్యానించారు. పవన్ వయసు పెరుగుతుందా లేదా తగ్గుతుందో తెలియకుండా ఉందని తలసాని అన్నారు. మూవీ ఇండస్ట్రీ బాగుండాలన్నదే తమ ప్రభుత్వం ముఖ్య […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ మూవీలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ గణేష్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డ్యాన్స్ చేసి పవర్‌స్టార్ అభిమానులను గణేష్ మాస్టర్ మెస్మరైజ్ చేశాడు. అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. భీమ్లా నాయక్ సినిమాలో ఓ స్పెషల్ ఉందని సీక్రెట్ రివీల్ […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సినిమా యూనిట్ మరో ట్రీట్ అందించింది. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేసిన యూనిట్.. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద మరో కొత్త ట్రైలర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. మంత్రి కేటీఆర్ ఈ ట్రైలర్ విడుదల చేశారు. తొలి ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తుండగా.. ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కొత్త ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించే సీన్లతో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. […]
హైదరాబాద్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సినిమాలో పాట పాడిన మొగులయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొగులయ్యను వేదికపై చిత్ర యూనిట్ సన్మానించింది. భీమ్లానాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొగులయ్య మాట్లాడుతూ.. భీమ్లానాయక్ సినిమాలో తాను పాట పాడటం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను పాట పాడకపోతే తానెవరో ఎవరికీ తెలిసేది […]