పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, కేటీఆర్ పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడం ఈ వేడుకకు హైలెట్‌గా నిలిచిందనే చెప్పాలి. ఇక ఈ మూవీ సంగీత దర్శకుడు తమన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఈనెల 25న సక్సెస్ మీట్‌లోనే మాట్లాడతానని చెప్పాడు. ఈ సినిమా ఏంటో తనకు తెలుసు అని.. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్అయ్యాయని.. ఇంకా రెండు పాటలు విడుదల కావాల్సి ఉందని తమన్ తెలిపాడు. ఆ పాటలను కూడా వీలైనంత త్వరగా విడుదల చేస్తామని తమన్ పేర్కొన్నాడు. తనకు దర్శకుడు త్రివిక్రమ్ ఇన్‌స్పిరేషన్ అని.. ఆయన వల్లే ఈ సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం వచ్చిందని తమన్ వెల్లడించాడు.