దేశంలో శుక్రవారంతో పోలిస్తే శనివారం కరోనా కేసులు మరిన్ని తగ్గాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11,499 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 255 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,05,844కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,13, 481గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 23,598 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,22,70,482కి చేరింది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో డైలీ కరోనా పాజిటివిటీ రేటు 1.01 శాతానికి పరిమితమైంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం మరో 28,29,582 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,77,17,68,379కు చేరినట్లు తెలిపింది.