ప్రొ.కబడ్డీ-8వ సీజన్ ఫైనల్ హోరాహోరీగా జరిగింది. ఈ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ను 37-36 తేడాతో దబాంగ్ ఢిల్లీ చిత్తు చేసి తొలి టైటిల్‌ను చేజిక్కించుకుంది. టైటిల్ పోరులో దబాంగ్ ఢిల్లీకి పట్నా పైరేట్స్ గట్టి పోటీనే ఇచ్చింది. తొలి హాఫ్‌లో ఢిల్లీ 15 పాయింట్లు సాధిస్తే పట్నా ఏకంగా 17 పాయింట్లు సాధించింది. అయితే రెండో హాఫ్‌లో ఢిల్లీ శక్తిని కూడదీసుకుని టైటిల్‌ను చేజిక్కించుకుంది.
దీంతో మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన పట్నా పైరేట్స్ ఒక పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. సెకండ్ హాఫ్‌లో పట్నా పైరేట్స్ 19 పాయింట్లు సాధిస్తే.. దబాంగ్ ఢిల్లీ 22 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. గత సీజన్‌లోనూ ఢిల్లీ ఫైనల్‌కు చేరుకున్నా టైటిల్ పోరులో మాత్రం చతికిలబడిపోయింది. అయితే ఈసారి మాత్రం కాస్తంత పట్టుదలగా ఆడిన ఢిల్లీ ఎట్టకేలకు తొలిసారిగా ప్రొ. కబడ్డీ టైటిల్‌ను చేజిక్కించుకుంది.
𝙱̶𝚕̶𝚊̶𝚌̶𝚔̶-̶𝚝̶𝚒̶𝚎̶ 𝓦𝓱𝓲𝓽𝓮-𝓒𝓸𝓪𝓽 event, for the win 🏆#VIVOProKabaddi #SuperhitPanga #PATvDEL @DabangDelhiKC pic.twitter.com/ls4H7MRWNq
— ProKabaddi (@ProKabaddi) February 25, 2022