Jaaga Reddy: టీఆర్‌ఎస్‌లో చేరే ఉద్దేశం లేదు.. రాజీనామాపై నిర్ణయం అప్పుడే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీనామా, కొత్త పార్టీ అనే చర్చ ఈ రోజు లేదని… మీ అందరి ఆలోచన ఏంటో తనకు తెలుసు అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు టీఆర్ఎస్‌లోకి వెళ్లే ఉద్దేశం లేదని.. బీజేపీలోకి వెళ్లే మాటే లేదని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలతో ఆయన అన్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే తనతో ఎంతమంది వస్తారని ఆయన అడిగారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని కాంగ్రెస్ నాయకులు కోరినట్లు జగ్గారెడ్డి మీడియాతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే జగ్గారెడ్డి వెంట ఉంటామని పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మధు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
2018లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వరుసగా ఎన్నికలు వచ్చాయి… తర్వాత కరోనాతో.. 20 నెలల పాటు పార్టీ కార్యకర్తలను కలవలేని పరిస్థితి వచ్చిందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ రెండేళ్లు తనకు చేతనైన సాయం చేశానని పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాతే రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి వెల్లడించారు. సోనియా, రాహుల్ గాంధీలను కలిసిన తర్వాత సానుకూల నిర్ణయం రావాలని దేవుడిని కోరుకుంటున్నానని.. ఒకవేళ పాజిటివ్ నిర్ణయం రాకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానని తెలిపారు. తాను బయటకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నానో పార్టీలో చాలామందికి తెలుసన్నారు. తన వెంట నాయకులు రాకుంటే ఊరికి పది మంది డప్పుల వాళ్ళను పట్టుకుంటానని.. జగ్గారెడ్డికి ఊర్లో కార్యకర్త అంటూ ఎవరు లేరని.. జగ్గారెడ్డి వస్తుండు అని డప్పు చాటింపు వేయిస్తానని.. అప్పుడు కనీసం 50 మంది అయినా తనతో రారా అంటూ ప్రశ్నించారు.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!