ఈ ఏడాది ఐపీఎల్ మెగా టోర్నీ మార్చి 26న ప్రారంభం అవుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా వెల్లడించారు. ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు సందడి చేయనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో తొలిసారిగా బరిలోకి దిగబోతున్నాయి. 10 జట్లు కలిపి 74 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. వీటిలో 70 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్డేడియం, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనున్నాయి. వాంఖడే స్టేడియం, డీవై […]
స్వదేశంలో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల వెస్టిండీస్‌పై వరుసగా వన్డేలు, టీ20ల సిరీస్‌లను వైట్ వాష్ చేసిన భారత్.. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను కూడా విజయంతోనే ప్రారంభించింది. తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 199 పరుగుల భారీ స్కోరు చేసింది. 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. చివరకు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 62 పరుగుల […]
★ హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో రూ.7వేల కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్న మంత్రి నిరంజన్‌రెడ్డి★ నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికలే ఎజెండాగా పలువురు ముఖ్య నేతలతో కేసీఆర్ మంతనాలు★ సంగారెడ్డి: ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశం… భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్న జగ్గారెడ్డి★ నేడు ప్రొ.కబడ్డీ 8వ సీజన్ ఫైనల్.. పట్నా పైరేట్స్‌తో తలపడనున్న దబాంగ్ ఢిల్లీ.. రాత్రి 8:30 […]
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘వలిమై’. గతంలో ఈ ఇద్దరితో హిందీ ‘పింక్’ను తమిళంలో ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేసిన బోనీ కపూర్ ఇప్పుడీ సినిమా నిర్మించారు. తెలుగువాడైన కార్తికేయ విలన్ గా నటించడంతో మనవారికీ ఈ మూవీ మీద కాస్తంత ఆసక్తి పెరిగింది. అయితే… అజిత్, హెచ్. వినోద్, బోనీకపూర్ కాంబోలో వచ్చిన ఈ సెకండ్ మూవీ అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విశాఖ […]
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అకారణంగా పోలీసులు తనకు నోటీసులు జారీ చేసి అరెస్టు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ అయ్యన్నపాత్రుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అయ్యన్నపాత్రుడుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో పశ్చిమ గోదావరి […]
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్‌లో మన భారతీయులు ఎంతో మంది చిక్కుకున్నారు. వారిలో 350 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఇటీవల భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా విమానం వెళ్లగా.. ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో విమానం ఖాళీగా తిరిగొచ్చేసింది. దీంతో తమ వాళ్ల సమాచారం తెలియకపోవడంతో ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర విద్యార్థుల […]
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయి. గురువారం ఉదయం రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై ముప్పేట దాడి చేసింది. దీంతో అంతర్జాతీయంగా పలు దేశాల్లోని స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇండియాలో అయితే మార్కెట్లు మొదలైన అరగంటలోనే బీఎస్‌ఈ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.256 లక్షల కోట్ల నుంచి రూ.246 లక్షల కోట్లకు తగ్గింది. షేర్ హోల్డర్లు భయంతో షేర్లను అమ్మేస్తుండటంతో […]
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగింది. తమ దేశంలోని ప్రవేశించి దాడులకు దిగుతున్న రష్యా జెట్ ఫైటర్‌ను ఉక్రెయిన్ కూల్చివేసింది. ఈ మేరకు ఐదు రష్యా ఎయిర్‌క్రాఫ్ట్, జెట్లు, హెలికాప్టర్లను కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. తమ దేశ భద్రత కోసం సైనికులు పూర్థి స్థాయిలో పోరాడతారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రష్యా బలగాలు ఎయిర్ స్ట్రైక్స్‌తో పాటు మిస్సైల్స్‌తో ఉక్రెయిన్‌పై అటాక్ చేస్తున్నాయి. ఎయిర్ డిఫెన్స్ కెపాసిటీని కూల్చేశామని రష్యా తెలిపింది. […]
ఏపీలో భీమ్లా నాయక్ సినిమాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పవర్‌స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. అదనపు షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసిన అంశంపై ప్రభుత్వం, జనసేన కార్యకర్తల మధ్య వివాదం చెలరేగుతోంది. అయితే ఈ వివాదంపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాపై చర్యలకు దిగుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఒక సినిమా పట్ల జగన్ సర్కారు […]