ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. గత సీజన్ వరకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ను ఇటీవల జరిగిన మెగా వేలంలో వేరే జట్టు కొనుగోలు చేయడంతో ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించనుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగావేలంలో పంజాబ్ తిరిగి దక్కించుకున్న […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం నాడు చంద్రబాబు సర్పంచుల అవగాహన సదస్సులో పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విధిస్తోన్న పన్నులు వంటి పలు అంశాలపై చంద్రబాబు విమర్శలు చేయడం, చెత్తపన్ను వసూలు చేయబోమని పంచాయతీలు తీర్మానం చేయాలని సూచించడం వంటి అంశాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘చంద్రబాబు గారు సర్పంచుల సదస్సు పెట్టింది ప్రభుత్వాన్ని ఎలా బ్లాక్ […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. భీమ్లానాయక్ మూవీ విడుదల నేపథ్యంలో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని కొందరు థియేటర్ యజమానులు కక్కుర్తికి తెర తీశారు. నెల్లూరులోని స్పైస్ సినిమా థియేటర్ నిర్వాహకులు ప్రస్తుతం ఇదే పనిలో పడ్డారు. తమ థియేటర్‌లో భీమ్లా నాయక్ సినిమా చూడాలంటే సినిమా టిక్కెట్‌తో పాటు ఫుడ్ కూపన్ కూడా కొనాల్సిందేనని షరతు పెట్టారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా టిక్కెట్ కోసం వస్తే […]
హైదరాబాద్ నగరంలో రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లపై హెచ్ఎండీఏ కీలక ప్రకటన చేసింది. రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. బండ్లగూడ, నాగోల్‌లోని సహ భావన టౌన్‌షిప్ 15 టవర్‌లో మొత్తం 2246 ఇళ్లు అమ్మకానికి ఉన్నాయని తెలిపింది. వీటిలో చదరపు గజం కనీస ధర రూ. 2200 నుంచి రూ. 2700గా నిర్ణయించారు. అలాగే ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని జలజ టౌన్ షిప్ 8 టవర్‌లో ఏకంగా […]
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో తొలి టీ20లో 37 పరుగుల వ్యక్తిగత స్కోరును చేరుకోవడంతో న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్‌ను వెనక్కి నెట్టి రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ 3,307 పరుగులతో అగ్రస్థానలో కొనసాగుతున్నాడు. గప్తిల్ (3,299 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (3,296 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో […]
ఏపీలో టిక్కెట్ రేట్ల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. మార్చి తొలివారంలో టిక్కెట్ రేట్లపై కొత్త జీవో అమల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజే విడుదలైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాకు జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్ రేట్లు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా టిక్కెట్ రేట్లు పెంచి విక్రయించినా, అదనపు షోలు ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రెవెన్యూ అధికారులు థియేటర్ల యాజమాన్యాలకు హెచ్చరికలు […]
తెలంగాణ రాజకీయ నేతలపై పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ నేతలు రాజకీయ విమర్శలను కళారంగానికి అంటనీయరని పవన్ కొనియాడారు. తెలంగాణ నేతలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తారని తెలిపారు. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని.. కళను అక్కున చేర్చుకుని అభినందించడానికి ప్రాంతీయ కుల, మత భేదాలు ఉండవని తెలియజెప్పినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్ ప్రకటించారు. ఒకవైపు బయో ఏషియా సదస్సులో బిల్‌గేట్స్‌తో కీలకమైన వర్చువల్ భేటీ […]
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,166 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 302 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,94,345కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,13, 226గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26,988 మంది కరోనా నుంచి కోలు కున్నారు. […]
ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరణకు 14417 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం నాణ్యత, మెనూ అమలు, మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాలల నిర్వహణ, విద్యాకానుక పంపిణీ, ఉపాధ్యాయుల గైర్హాజరు, ఇతర అకడమిక్ అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదులు, అభిప్రాయాలు వెల్లడించేందుకు ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ వెల్లడించింది. కాగా మధ్యాహ్న భోజనం పథకంలో మెనూను […]
పవర్‌స్టార్ అభిమానులలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈరోజే భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది. తొలి షో నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. దీంతో పవర్‌స్టార్ అభిమానుల హంగామా మాములుగా లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా టాక్ గురించి తెగ చర్చ నడుస్తోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద బ్యానర్లు, డప్పులు, దండలు.. ఇలా పవన్ అభిమానుల […]