Rajamundry: హీరో రామ్‌చరణ్‌కు తియ్యటి కానుక.. బాహుబలి ఖాజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత డైరెక్టర్ శంకర్‌తో రామ్‌చరణ్ ఓ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చిత్రీకరణ కోసం రాజమండ్రి వెళ్లిన రామ్ చరణ్ అభిమానులతో ఫొటో షూట్లో పాల్గొన్నాడు. రామ్‌చరణ్ రాజమండ్రి వచ్చిన సందర్భంగా అతడికి సురుచి సంస్థ మధురమైన కానుక అందించింది. తాపేశ్వరంలో తయారుచేసిన ఈ బాహుబలి కాజాను చెర్రీకి బహూకరించింది.
కాగా రాజమండ్రి వచ్చే ప్రముఖులకు సురుచి సంస్థ బాహుబలి కాజాను బహూకరించడం ఓ ఆనవాయతీగా వస్తోంది. గతంలో సమంత, నాగార్జున, కృతి శెట్టి, ఫరియా అబ్దుల్లా తదితర సినీ తారలు కూడా ఈ స్పెషల్ కాజా రుచి చూశారు. తాజాగా ఈ బాహుబలి కాజాను దర్శకుడు శంకర్‌కు కూడా అందజేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా పేరుపెట్టలేదు. రామ్ చరణ్ కెరీర్లో ఇది 15వ చిత్రం. ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు