ఏపీలో వైఎస్ షర్మిలతో కలిసి ఆమె భర్త బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడతారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై బ్రదర్ అనిల్ స్పందించారు. ఏపీ వేదికగా తాము కొత్త పార్టీ పెడుతున్నామన్న విషయం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ వచ్చిన బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో పాటు పలు బీసీ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో కూడా బ్రదర్ అనిల్ […]
బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అకారణంగా రేవంత్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారని ఆయన గుర్తుచేశారు. మంత్రి హరీష్‌రావు కేంద్రాన్ని తిడుతుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాక్షస ఆనందం పొందారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో 270 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఆ తరువాత ఎన్నికల్లో తుడుచుకుపోయిందన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కుదరదన్నారు. అసలు బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటి […]
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. సెలవులను ఎంజాయ్ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్లిన షేన్ వార్న్ అక్కడి హోటల్ గదిలో విగతజీవుడై పడిఉన్న సంగతి అతడి వ్యక్తిగత సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. అయితే వార్న్ మరణంపై థాయ్‌లాండ్ పోలీసులు షాకింగ్ అంశాలను ప్రస్తావించారు. వార్న్ గదిలో రక్తపు మరకలు గుర్తించినట్లు పోలీసులు చెప్పడం సంచలనం రేపుతోంది. దీంతో వార్న్ మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గుండెపోటుతో కింద […]
తెలంగాణ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తోంది. ఈ మేరకు రేపు సెలవు ప్రకటిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంబరాలు కొనసాగుతున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని మహిళలకు సరైన […]
ఏపీలోని చిత్తూరు జిల్లాలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులపై జంతుబలి కేసు నమోదైంది. భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా కొందరు పవన్ అభిమానులు మేకను బలిచ్చినట్టు చిత్తూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులపై ఆంధ్రప్రదేశ్ జంతువులు, పక్షుల బలి నిరోధక చట్టం-1950లోని సెక్షన్-6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A), పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపారు. పవర్‌స్టార్ […]
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. తాజాగా సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతోంది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ సోమవారం నాడు ప్రకటించారు. 2025 నాటికి తొలిదశ ప్రారంభం అవుతుందని తెలిపారు. తర్వాత దశలవారీగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ పరిశ్రమల […]
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నిర్ణయాత్మక స్థితికి చేరుకుంది. రష్యా సైనిక దాడి ప్రారంభించి 12 రోజులు అవుతోంది. తన డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి మళ్లేది లేదని పుతిన్ అంటున్నాడు. మరోవైపు, రష్యా దాడులను నిలువరించాలన్న ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీ విజ్ఞప్తిపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ ప్రారంభించించింది. రష్యా దాడులను జెలెన్‌స్కీ టెర్రరిజంతో పోల్చాడు. అది యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు -ఐసీసీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. […]
ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘నో ఫ్లై జోన్’. రష్యా దాడులు ఉధృతం కావటంతో తమ గగన తలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఆయన నాటో కూటమికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. అయితే అమెరికా, పశ్చిమ దేశాలు అందుకు ఒప్పుకోవటం లేదు. నోఫ్లై జోన్ ప్రకటన అంటే రష్యా విమానాలను కూల్చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే. రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టే. అప్పుడు పరిస్థితి ఇప్పటికన్నా […]
ఏపీ కేబినెట్ జగన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూను గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్ అందుకోసం ఏపీ అధికార భాషా చట్టం 1966కు సవరణ చేయాలని కూడా తీర్మానించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 35 కీలక అంశాలపై చర్చ జరిగింది. విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు కేబినెట్ […]