ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ అధికారులు వరుసబెట్టి దాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ ప్రజలు తమ దేశాన్ని విడిచి వలస వెళ్లిపోతున్నారు. రష్యా దాడులు ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 15 లక్షల మంది వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతోన్న వలస సంక్షోభం ఇదేనని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశమైన మాల్డోవాకు శరణార్థులు పోటెత్తుతున్నారు. గత 11 రోజుల వ్యవధిలో 2.30 లక్షల మంది మాల్డోవాలోకి ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు.
ఉక్రెయిన్‌లోని చాలా మంది ప్రజలు సెంట్రల్ బుడాఫెస్ట్ నగరంలోని న్యుగటి రైల్వేస్టేషన్ గుండా దేశ సరిహద్దులకు చేరుకుని అక్కడి నుంచి పక్క దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. సరిహద్దులకు చేరుకుంటున్న వలసదారులకు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆహారం, వస్తువులను వలసదారులకు సరఫరా చేస్తున్నారు. మరికొందరు శరణార్ధులు జకర్‌పట్టియా ఒబ్లాస్ట్ నుండి తూర్పు ఉక్రెయిన్‌లోని సరిహద్దు గుండా వలస వెళ్తున్నారు. నల్ల సముద్రంలోని ఓడరేవు నగరమైన ఒడెస్సా నుండి కూడా కొందరు శరణార్ధులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.