UP: భార్య రహస్యంగా ఫోన్ మాట్లాడుతుందని భర్త మాస్టర్ ప్లాన్.. అచ్చం సినిమా మాదిరిగా..!
- ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో దారుణం
- అనుమానంతో భార్యను చంపిన భర్త
- ఇంటి వెనుకే పాతి పెట్టి నాటకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా హంతకుల్లో మార్పు రావడం లేదు. కలకాలం తోడుంటానని ప్రమాణం చేసిన భాగస్వాములను అత్యంత దారుణంగా కడతేర్చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ఖుష్బూ, అర్జున్ భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. లూథియానాలో కూలీగా పని చేస్తున్న అర్జున్ డిసెంబర్ 21న గోరఖ్‌పూర్‌కు వచ్చాడు. అయితే భార్య ఖుష్బూ రహస్యంగా మొబైల్ ఫోన్ వాడడం చూసి నిర్ఘంతపోయాడు. భర్త రాగానే ఫోన్‌ను రహస్యంగా దాచిపెట్టేసింది. దీంతో అదే రాత్రి భార్యతో వాగ్వాదం పెట్టుకుని గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుక ఆరు అడుగుల భారీ గుంత తవ్వేసి మంచంతో పాటే పాతిపెట్టేశాడు.
అనంతరం అర్జున్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఖుష్బూ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. దీంతో రోజుల తరబడి ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఏ ఆధారం లభించలేదు. దీంతో బాధితురాలి తండ్రి, అర్జున్ మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Silver Rates: బాబోయ్ సిల్వర్.. మరోసారి భారీగా పెరిగిన వెండి ధర
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మృతదేహాన్ని నదిలో విసిరేసినట్లు పేర్కొన్నాడు. దీంతో నిందితుడిని గ్రామం వెలుపల ఉన్న నది ఒడ్డుకు తీసుకెళ్లి గంటల తరబడి వెతికించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో అర్జున్ విచారించగా నేరాన్ని అంగీకరించాడు. చంపేసి ఇంటి వెనుక పాతిపెట్టినట్లుగా తెలిపాడు. దీంతో పోలీసులు గుంతను తవ్వగా మృతదేహం కనిపించింది.
ఇది కూడా చదవండి: Canada: కెనడాలో మరో ఘోరం.. టొరంటో వర్సిటీలో భారతీయ విద్యార్థి హత్య
అక్రమ సంబంధం ఉన్న అనుమానంతో భార్యను చంపేశాడని గోరఖ్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ శిల్పా కుమారి తెలిపారు. పెళ్లై రెండేళ్లు అయిందని.. పిల్లలు పుట్టలేదని చెప్పారు. బాధితురాలి తమ్ముడి ఫిర్యాదు ఆధారంగా అర్జున్‌ను అరెస్టు చేయగా.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు.
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!