ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్ ఈనెల 4న థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరో రోజుల తర్వాత వార్న్ డెడ్‌బాడీ ప్రత్యేక విమానం ద్వారా గురువారం నాడు థాయ్‌లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు చేరుకుంది. శవపేటికలో వార్న్ భౌతికకాయాన్ని ఉంచి ఆస్ట్రేలియా జాతీయ పతాకం దానిపై కప్పారు. థాయ్‌లాండ్‌లోని డాన్ మ్యూంగ్ అనే ఎయిర్ పోర్టు నుంచి మెల్‌బోర్న్‌కు డసాల్ట్ ఫాల్కన్ 7ఎక్స్ చార్టర్డ్ విమానంలో షేన్‌వార్న్ మృతదేహాన్ని థాయ్ ప్రభుత్వం తరలించింది. […]
మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్ నగరంలోని యాప్రాల్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నీ ముగిసింది. స్కైకింగ్స్ సహకారంతో ఒలింపియన్ అసోసియేషన్ యాప్రాల్‌లోని మెహర్‌బాబా కాలనీలో ఈ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ టోర్నీకి ముఖ్య అతిథిగా నేరేడ్‌మెట్ 136వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తి గల మహిళలందరూ ఫుట్‌బాల్ లీగ్‌లో పాల్గొనేందుకు ముందుకు రావాలని ప్రోత్సహించారు. మహిళలందరూ తమ లక్ష్యాలను సాధించడానికి […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పట్లో చంద్రబాబుతో జతకట్టి చేతులు పైకెత్తిన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో కళ్లు తేలేశాయని.. చంద్రబాబు ఐరన్ లెగ్ కారణంగానే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పార్టీ కళ్లు తేలేసిందని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. యూపీలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీతో మళ్లీ జత కట్టేందుకు చంద్రబాబు చూస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీంతో అఖిలేష్‌తో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం […]
అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే ఈ ఫలితాలు ఉన్నాయి. అయితే పంజాబ్ లో ఆప్ ఊహించని మెజార్టీ సాధించింది. అధికార కాంగ్రెస్ దాదాపు తుడిచి పెట్టుకుపోవటం ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన విశేషం. ఇప్పటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక దేశ వ్యాప్త విస్తరణకు ప్రయత్నిస్తుంది. ఈ విజయంతో ఆ పార్టీకి జాతీయ హోదా కూడా దక్కుతుంది. దేశంలో […]
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో విద్యా శాఖకు సంబంధించిన ఓ పథకాన్ని మంత్రి ఆదిమూలపు సరేష్ ప్రస్తావించారు. ఈ వీడియోను ఆధారం చేసుకుని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దీంతో మంత్రి సురేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విద్యా శాఖకు సంబంధించి తాము పాత పథకాన్నే కొనసాగిస్తున్నామని.. ఆ పథకాన్ని జగన్ తీసుకొచ్చారంటూ […]
మరో రెండు వారాల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు శుభవార్త అందింది. ఆ జట్టు మెగా వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. మైదానంలో ఆర్చర్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ముంబై అభిమానులు […]
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ కూడా ఇప్పుడు చేజారిపోయింది. ముఖ్యంగా పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ అంశంపై తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన అభిప్రాయాలు వెల్లడించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన వైఫల్యమే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో దెబ్బతీసిందన్నారు. అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి ఈ […]
రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ ఈనెల 11న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. సాహో సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల విరామం అనంతరం ప్రభాస్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియాగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మూవీ ఐదో ఆటకు అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. మార్చి […]
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అవమానించి టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియడం లేదని సెటైర్ వేశారు. అసలు టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గత పాలనను ప్రజలు ఛీకొట్టారన్న జగన్.. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ప్రజా సంక్షేమ పథకం ఒక్కటైనా […]