టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పట్లో చంద్రబాబుతో జతకట్టి చేతులు పైకెత్తిన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో కళ్లు తేలేశాయని.. చంద్రబాబు ఐరన్ లెగ్ కారణంగానే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పార్టీ కళ్లు తేలేసిందని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. యూపీలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీతో మళ్లీ జత కట్టేందుకు చంద్రబాబు చూస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీంతో అఖిలేష్‌తో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాయావతి తనను ఎక్కడ దులిపేస్తారోనని చంద్రబాబు కలవరపడుతున్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు చంద్రబాబుది గుంటనక్క బుద్ధని తెలిసే మోదీ గారు దూరం పెట్టారని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. వంగి వంగి దండాలు పెట్టే రోజుల్లో అయితే తాను పుతిన్‌ను ఒప్పించి యుద్ధం ఆపిస్తానని వీర బిల్డప్పులు ఇచ్చేవారని… పోలెండ్‌లో మకాం పెట్టి మా బాబే విద్యార్థులను ఫ్లైట్లు ఎక్కించాడనే ఎల్లో మీడియా స్టోరీలు జనానికి కంపరం పుట్టించేవి అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
చంద్రబాబుది గుంటనక్క బుద్ధని తెలిసే మోదీ గారు దూరం పెట్టారు. వంగి వంగి దండాలుపెట్టే రోజుల్లో అయితే తాను పుతిన్‌ను ఒప్పించి యుద్ధం ఆపిస్తానని వీరబిల్డప్పులు ఇచ్చేవారు. పోలెండ్లో మకాం పెట్టి మాబాబే విద్యార్ధులను ఫ్లైట్లు ఎక్కించాడనే ఎల్లో మీడియా స్టోరీలు జనానికి కంపరం పుట్టించేవి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 10, 2022