AUS vs ENG 4th Test: మొదటి రోజే నేలకూలిన 20 వికెట్లు.. ఐదేసిన జోష్ టంగ్..!
- మెల్‌బోర్న్ వేదికగా యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు మ్యాచ్
- తొలి రోజే బౌలర్లు ఆధిపత్యం
- మొదటి రోజే నేలకూలిన 20 వికెట్లు..
- ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్
- ఇంగ్లండ్ 29.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS vs ENG 4th Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా నేటి నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ మొదలయింది. ఇక నేడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి.. పూర్తిగా ఇరుజట్ల బౌలర్ల హవా కనిపించింది. మొదటి రోజే రెండు జట్లు ఆలౌట్ కావడం విశేషం. మొదటి రోజు ముగిసే సరికి రెండు జట్లు కలిసి మొత్తం 20 వికెట్లు కోల్పోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. అతనికి తోడుగా అట్కిన్సన్ 2 వికెట్లు.. స్టోక్స్, కార్స్ ఒక్కో వికెట్‌తో సహకరించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మైఖేల్ నేసర్ (35), ఉస్మాన్ ఖవాజా (29) మాత్రమే కాస్త పోరాడారు.
Virat Kohli: కింగ్ ఎక్కడున్నా కింగే.. కొనసాగుతున్న కోహ్లీ వీరబాదుడు.. ఖాతాలోకి మరో రికార్డ్..!
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ఇక ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ కూడా ఆసీస్ బౌలింగ్ దెబ్బకు తట్టుకోలేకపోయింది. కేవలం 29.5 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో హ్యారీ బ్రుక్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట్స్మెన్స్ పూర్తిగా చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్లలో మైఖేల్ నేసర్ 4 వికెట్లు, స్కాట్ బోలాండ్ 3 వికెట్లు, మిచెల్ స్టార్క్ 2 వికెట్లతో అదరగొట్టారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్‌లో వికెట్ నష్టంలేకుండా 4 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ మొత్తం 46 పరుగుల ఆధిక్యంలో ఉంది.
1.5K 144Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Realme 16 Pro..!
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!