ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు దూసుకెళ్తున్నా ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్ ధామి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. సీఎం పుష్కర్ సింగ్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ చంద్ కప్రీ 6,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా ఖతిమా నియోజకవర్గంలో మొత్తం 91,325 ఓట్లు పోలవగా పుష్కర్ సింగ్ […]
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో బీజేపీ తిరిగి విజయ పీఠాన్ని దక్కించుకుంది. అయితే బీజేపీ సాధించిన విజయంలో ఓ తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది. అతడే సత్యకుమార్. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నేతగా మారి ప్రస్తుతం యూపీ బీజేపీ ఇంఛార్జిగా ఆయన సేవలందిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి తనదైన ప్రచార వ్యూహ రచనతో యూపీలోని 403 స్థానాల్లో 135 స్థానాలకు సత్యకుమార్ చేసిన కృషి అనితర సాధ్యమని రాజకీయ విశ్లేషకులు […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తోంది. అయితే పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం రావడం ఖరారు కాగా గోవాలో హంగ్ ఏర్పడుతుందని ప్రస్తుత ఫలితాల సరళి చాటి చెప్తోంది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 19 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో గోవా ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ, ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. […]
యూపీలో కాంగ్రెస్ ఘోరంగా పతనమైందని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. 403 స్థానాలకు పోలింగ్ జరగగా 400 చోట్ల హస్తం తరఫున అభ్యర్థులు పోటీ చేశారు. అయితే కేవలం ఒక్క చోట మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్నారు. నానమ్మ ఇందిరా గాంధీ పోలికలు ఉన్న ప్రియాంకా గాంధీ యూపీపై ప్రత్యేక దృష్టి పెట్టి తీవ్రంగా శ్రమించినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా ఉన్న అమేథీ, రాయ్‌బరేలీలోనూ హస్తం నేతలకు ఓటమి తప్పలేదు. కాగా […]
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయ అభ్యర్థుల భవితవ్యం ఈనెల 10న తేలిపోనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో లడ్డూలకు బాగా గిరాకీ ఏర్పడింది. ఎన్నికల ఫలితాలకు ముందు పలు రాజకీయ పార్టీల నుంచి లడ్డూల కోసం ఆర్డర్లు పోటెత్తాయి. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాల్లో భాగంగా మిఠాయిలు పంచుకోవడం మాములే. దీంతో విజయంపై ధీమాతో పలు రాజకీయ […]
తెలంగాణలో కొత్తగా 80వేల ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఈ అంశంపై స్పందించారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే సీఎం కేసీఆర్ ఈరోజు ఈ ఉద్యోగ ప్రకటన చేశారని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాల ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని.. కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క కేసీఆర్ వల్లే రాలేదని.. అందరి త్యాగాల […]
క్రికెట్‌లో మన్కడింగ్ పలు మార్లు ఎలాంటి వివాదాలను సృష్టించిందో గతంలో ఎన్నో సార్లు చూశాం. బౌలర్ బంతి వేసే సమయంలో నాన్ స్ట్రైకర్ ముందే క్రీజు దాటితే బౌలర్ అవుట్ చేయడాన్ని మన్కడింగ్ అంటారు. అయితే ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ అసోసియేషన్ సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వివాదాలకు కారణమయ్యే మన్కడింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. బౌలింగ్ సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఆటగాడు పరుగు కోసం సిద్ధంగా ఉండాలి కాబట్టి అందులో భాగంగానే […]
తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ అంశంపై స్పందించారు. ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తడబడిన సందర్భమే లేదని.. ఇప్పటికే 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని ఆమె గుర్తు చేశారు. మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కల్పనకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని ఆమె స్పష్టం చేశారు. అటు కేంద్రంలో ప్రధాని మోదీ రెండు కోట్ల […]
ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు సాధించుకున్నట్లే ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు. ఇందులో భాగంగా 80,039 ఉద్యోగాలకు బుధవారం నుంచే నోటిఫికేషన్‌లు జారీ అవుతాయని తెలిపారు. ఇకపై వివిధ శాఖలలో ఖాళీలను ముందే గుర్తించి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాలు […]