ఈనెల 14న గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని జనసేన పార్టీ తలపెట్టింది. ఈ మేరకు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆవిర్భావ వేడుకలకు తమ వంతు సహకరించాలని ప్రవాసాంధ్రులను కోరుతూ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. నాదెండ్ల పిలుపునకు ఇతర దేశాల్లోని జనసైనికులు భారీగానే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో […]
స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న డే/నైట్ టెస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన జడేజా శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన జడేజా (175 నాటౌట్).. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో […]
సోషల్ మీడియాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఆయన ప్రధాన ప్రతిపక్షం టీడీపీని విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల సినిమా టిక్కెట్ రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో టిక్కెట్ రేట్లు ఎందుకు పెంచరంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయగా.. ఇప్పుడు టిక్కెట్ రేట్లు పెంచాక ఆయన ఎందుకు […]
దేశంలో ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు సంబంధించి ఓ స్కాం తాజాగా వెలుగు చూసింది. టెలిగ్రామ్‌ను ఉపయోగించుకుని షేర్ల ట్రేడింగ్ కుంభకోణానికి పలు సంస్థలు తెరతీశాయని ఆరోపణలు రావడంతో సెబీ రంగంలోకి దిగింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సెబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా సంస్థలు టెలిగ్రామ్ ద్వారా 50 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్ల కోసం రికమండేషన్లు అందించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన లిస్టెడ్ షేర్లకు సంబంధించి సలహాలు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లు […]
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ ఇప్పటి వరకు అధికారంలోకి రాని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం ప్రారంభించబోతుందని తెలిపారు. బీజేపీ ఫోకస్ పెట్టే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. త్వరలోనే ఏపీ, తెలంగాణలో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని జీవీఎల్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో చాలా మంది నేతలు తమ కాంటాక్టులలోకి వస్తున్నారన్నారు. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ […]
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కోసం కొత్త కస్టమర్లను చేర్చుకోరాదని ఆర్‌బీఐ ఆదేశించింది. అంతేకాకుండా కంపెనీ ఐటీ సిస్టమ్‌ను సమగ్రంగా ఆడిట్ చేసేందుకు ఐటీ ఆడిట్ కంపెనీని నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ ఆడిటర్ల నివేదిక వచ్చే వరకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఆడిటింగ్‌కు ఆదేశించామని స్పష్టం చేసింది. ఒకవేళ ఆన్‌బోర్డు చేయాలంటే ఆర్‌బీఐ ప్రత్యేక […]
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రభావం చమురు ధరలపై విపరీతంగా చూపిస్తోంది. ఫలితంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శ్రీలంకలో చమురు ధరలను పెంచుతున్నట్లు ఎల్‌ఐవోసీ ప్రకటించింది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచుతున్నట్లు తెలిపింది. ధరలను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.214కి చేరింది. మరోవైపు శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ […]
సీబీఎస్‌ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు 10, 12 తరగతులకు సంబంధించి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం అవుతాయని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. అలాగే మే 24న ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. 12వ తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 26న ప్రారంభం అవుతాయని.. ఈ పరీక్షలు జూన్ 15న పూర్తవుతాయని తెలిపింది. ఈ […]
కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజనం తిన్నవారిలో కొందరు విద్యార్థులు వెంటనే వాంతులు చేసుకున్నారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఈవో.. […]
2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతటి గొప్ప విజయం సాధించిన భారత జట్టులోని ఆటగాళ్లలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కడే క్రికెట్‌లో కొనసాగుతుండటం గమనార్హం. మిగతా క్రికెటర్లందరూ రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇటీవల శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం ప్రపంచకప్ విన్నింగ్ టీమ్‌లో కోహ్లీ ఒక్కడే మిగిలాడు. […]