Tata Motors: టాటా నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ కార్లు..
- ఈవీ కార్ మార్కెట్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్..
- టాటా నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ కార్‌లు..
- సియెర్రా. ఈవీ, అవెన్యాతో పాటు ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్త కార్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: టాటా మోటార్స్(Tata Motors), తన ఎలక్ట్రిక్ వాహనాల(EV) పోర్ట్‌ఫోలియోను మరింత బలపరుచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే, దేశంలో ఈవీ కార్ మార్కెట్‌లో టాటా అగ్రగామిగా ఉంది. అయితే, 2030 నాటికి మరో 5 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో వేగంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్ పెరుగుతన్న నేపథ్యంలో, అగ్రగామిగా ఉన్న టాటా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. 2026 నుంచి టాటా నుంచి కొత్త ఈవీ కార్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.
ఇందులో సియెర్రా. ev(Sierra.ev), అప్డేటెడ్ పంచ్.ev ( Punch.ev) 2026 తొలి అర్థభాగంలో రాబోతున్నట్లు తెలుస్తోంది. అదే ఏడాది చివరి నాటికి టాటా నుంచి తొలిసారిగా ప్రీమియం ఈవీ కార్ ‘అవిన్యా’(Avinya) రాబోతోంది. FY2027, FY2030 మధ్య మరో మూడు కొత్త ఈవీ మోడళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
Read Also: MEA: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలను ఖండించిన భారత్..
టాటా మోటార్స్ ఇప్పటికే భారత్‌లో మొత్తం 2.5 లక్షల ఈవీల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లలో ఒక్క టాటా నుంచే 65 శాతం కార్లు ఉన్నాయి. ముఖ్యంగా, టాటా నుంచి వచ్చిన నెక్సాన్.ఈవీ(Nexon.ev) ఒక్కటే లక్షకు మించిన అమ్మకాలను నమోదు చేసింది. దేశంలో లక్ష మార్కును దాటిని తొలి ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది. టాటా మోటార్స్ తన ఈవీ కస్టమర్లలో తొలిసారిగా ఈవీని కొనుగోలు చేసిన వారు 26 శాతం మంది ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం, టాటా నుంచి టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, హరియర్ ఈవీలు ఉన్నాయి.
మరోవైపు, టాటా మోటార్స్ తన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరుచుకుంది. టాటా ఈవీ ఓపెన్ కొలాబరేషన్ ఫ్రేమ్‌వర్క్ కింద సుమారు 4 లక్షల ఛార్జింగత్ పాయింట్లు ఉన్నాయి. ఇందుల్లో 30,000కు పైగా ఫాస్ట్ చార్జర్లు ఉ న్నాయి. 2030 నాటికి వీటిని 10 లక్షల చార్జింగ్ పాయింట్లకు, ఇందులో కనీసం 1 లక్షలకు పైగా ఫాస్ట్ చార్జర్లు ఉండాలని ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!