కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ బయటపడటంతో అధికారులు లాక్‌డౌన్ విధించారు. దీంతో కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షలు ఉన్న చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఫ్యామిలీ సభ్యుల్లో ఒకరే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలని సూచించారు. అది […]
ఏపీ బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తోందని ఆయన కామెంట్ చేశారు. అప్పులు పెట్టిన జగన్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. అప్పులు ఎగ్గొట్టడానికా అంటూ ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఏ ప్రాంతం అభివృద్ధి గురించి ప్రస్తావనే లేదని ఆరోపించారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. మసిపూసి […]
ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు పెదవి విరిచారు. సంక్షేమ పథకాలన్నీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. పాత పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రభుత్వం ఆధారపడుతోందని.. అప్పుల కోసం తిరగడం తప్ప సంక్షేమం గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దారి […]
ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఏపీ వార్షిక బడ్జెట్ 2022కు ఆమోదం తెలిపేందుకు సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. అయితే తమకు ఇదే చివరి కేబినెట్ సమావేశమా? అని కొందరు మంత్రులు అడగ్గా.. మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్లు పార్టీ కోసం పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని జగన్ స్పష్టం చేశారు. […]
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యూ కార్లు టాప్ ప్లేస్‌లో ఉంటాయి. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ కార్లు విలాసవంతమైన వాహనాలుగా పేరుపొందాయి. అయితే తాజాగా బీఎండబ్ల్యూ కార్లలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ముప్పు ఉందని నిపుణులు గుర్తించారు. బీఎండబ్ల్యూ కార్లలోని పాజిటివ్ క్రాంక్ కేస్ వెంటిలేషన్ వాల్వ్ లోపభూయిష్టంగా ఉందని, ఇది షార్ట్ సర్క్యూట్‌కు దారితీసి కారులో అగ్నిప్రమాదానికి కారణమవుతుందని వారు తెలిపారు ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా కార్లను ఈ జర్మనీ […]
టాలీవుడ్‌కు మరో సీనియర్ నటుడు దూరమయ్యారు. ముత్యాల ముగ్గు ఫేం నటుడు పి.వెంకటేశ్వరరావు (90) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఈరోజు ఆయన కన్నుమూశారు. రంగస్థల కళాకారుడిగా పలు నాటకాల్లో నటించిన వెంకటేశ్వరరావు 1965లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన తేనెమనసులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఏడాదిలోనే మళ్లీ కృష్ణ నటించిన కన్నె మనసులు చిత్రంలో నటించారు. అయితే 1975లో లెజెండ్రీ డైరెక్టర్ […]
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగిన రావల్పిండి పిచ్‌కు ఐసీసీ బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఐదేళ్లలో 5 డీమెరిట్ పాయింట్లు వస్తే 12 నెలల పాటు ఆ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు వీల్లేదు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఆడిన తొలి టెస్టులో పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలించింది. దీంతో పాకిస్థాన్ […]
ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ శుక్రవారం రిలీజ్ అవుతోంది. అయితే ఏపీలో ఈ మూవీ టిక్కెట్ రేట్లపై తొలుత సందిగ్ధత నెలకొంది. ఏపీలో 20 శాతం షూటింగ్ జరిపిన సినిమాలకే టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాధేశ్యామ్ షూటింగ్ 20 శాతం మేర జరపకపోవడంతో ఈ సినిమా టిక్కెట్ రేట్లపై ఎలాంటి నిర్ణయం వస్తుందో అని గురువారం సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో కూడా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభం కాలేదు. ఈ […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విజయం అని ఆయన అభివర్ణించారు. దేశంలో తమ పాలనకు ప్రజలు ఇచ్చిన బహుమతి అని తెలిపారు. ఈసారి హోలీ మార్చి 10నే మొదలైందని.. ఇవాళ్టి ఫలితాల్లో గొప్ప సందేశం ఉందన్నారు. ప్రజల నమ్మకం, విశ్వాసం పొందేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేశారు కాబట్టి ఇది కార్యకర్తల విజయమని మోదీ తెలిపారు. దేశంలోని నాలుగు వైపులా ప్రజలు […]
ఏపీలో ఇటీవల ఖాళీ అయిన ఓ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మహ్మద్ కరీమున్నిసా మరణించగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇటీవలే ఈసీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా కరీమున్నిసా కుమారుడు రుహుల్లా నామినేషన్ దాఖలు చేశారు. […]