CM Jagan: చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేది.. వెన్నుపోటు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అవమానించి టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియడం లేదని సెటైర్ వేశారు. అసలు టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గత పాలనను ప్రజలు ఛీకొట్టారన్న జగన్.. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ప్రజా సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు.
టీడీపీ పాలనలో ఎన్నికల వాగ్దానాలకు విలువేంటో.. తమ ప్రభుత్వంలో చేసిన వాగ్దానాలకు విలువేంటో స్పష్టంగా తెలుస్తోందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారని జగన్ గుర్తుచేశారు. తాము మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఇప్పటివరకు 96శాతం వాగ్దానాలను నెరవేర్చామని జగన్ చెప్పారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కుల, మత, పార్టీలు, వర్గాలు అని చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎవరి హయంలో పాలన బాగుందో ప్రజలంతా ఆలోచించాలన్న ఆయన.. గ్రామాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వైఎస్ఆర్ క్లినిక్‌లు ఇలా ఎన్నో మార్పులు చేశామని జగన్ తెలిపారు.
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!