తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 91,147 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని ఈరోజు నుంచే నోటిఫై చేస్తున్నామన్నారు. అందులో 80,039 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచే శాఖల వారీగా నోటిఫికేషన్లు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులే పొందుతారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పోలీస్ […]
తెలంగాణ ఏర్పాటు అనేది దేశ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగించారు. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో తానూ కూడా లాఠీదెబ్బలు తిన్నానని తెలిపారు. వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్నివిధాలుగా అన్యాయానికి గురైందని సీఎం కేసీఆర్ అన్నారు. సినిమాల్లో ఒకప్పుడు తెలంగాణ భాషను కమెడియన్లకు వాడేవారని.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష వాడితేనే హీరో క్లిక్ అవుతున్నాడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా […]
తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84 శాతం) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75 శాతం) కంటే ఇది దాదాపు 12 శాతం అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా మరో 10.48 శాతం పెరిగి 2.20 కోట్లకు చేరుతుందని నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అధికారులు భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా […]
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు ఉందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ ఆయన లేఖలో కోరారు. చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని లేఖలో వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులకు సైతం తీవ్రవాదులు, సంఘ […]
కొన్నిరోజులుగా అగ్రదేశం రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. రష్యా దాడుల కారణంగా ఆ దేశం భారీగా నష్టపోతోంది. దీంతో ఉక్రెయిన్‌కు అండగా నిలబడేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కోసం 723 మిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక సాయంపై ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు. ప్రపంచ బ్యాంకు ప్రకటించిన సాయంలో 350 మిలియన్ డాలర్లు […]
పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్‌లోని సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. బొగ్గు గని శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీం ఈరోజు వెలికితీసింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు రాగా… బుధవారం ఉదయం ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ జయరాజు, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ మృతదేహాలను వెలికితీశారు. వారి మృతదేహాలను […]
దివంగత మాజీ సీఎం జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొడుతూ వచ్చారు. దీంతో ఈనెల 21న పన్నీర్ సెల్వం విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. మరోవైపు […]
కరోనా లాక్‌డౌన్ కారణంగా 2020లో ఏపీలో రోడ్డుప్రమాదాలు తగ్గాయి. అయితే 2021లో మళ్లీ రోడ్డుప్రమాదాల్లో చనిపోయిన వారి మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ మేరకు ఏపీ రహదారి భద్రత కౌన్సిల్ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక ప్రకారం… గత ఏడాది ఏపీలో మొత్తం 19,729 రోడ్డుప్రమాదాలు జరగ్గా.. వాటిలో 8,053 మంది చనిపోయారు. మరో 21,169 మంది గాయపడ్డారు. 2020తో పోలిస్తే 2021లో రోడ్డుప్రమాదాల్లో 10.16 శాతం, మరణాల్లో 14.08 శాతం, క్షతగాత్రుల్లో 7.94 […]
మహిళా ప్రభుత్వం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది ఏపీలోని ఉద్యోగినులకు పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల సెలవులకు సంబంధించి మంగళవార రాత్రి ప్రభుత్వ ఆర్థిక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ మేరకు పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్ క్యాజువల్ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్‌గ్రేషియా […]
★ నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఉ. 10 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. లక్ష ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసే అవకాశం.. విద్య, పోలీస్, వైద్య శాఖల్లో భారీగా పోస్టులు★ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు★ నేడు హైదరాబాద్‌లో కేఆర్ఎంబీ సమావేశం.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో భేటీ కానున్న కృష్ణా బోర్డు ఛైర్మన్★ నేడు కాకినాడ జేఎన్టీయూ 8వ స్నాతకోత్సవం , ఆన్‌లైన్ […]