ఐపీఎల్‌లో విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ కూడా ఉంటాడు. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు ఈ ఏడాది కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మరోవైపు ఇంకో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆప్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ బరిలోకి దిగుతున్నాడు. రషీద్ ఖాన్ కూడా ఐపీఎల్‌లో విజయవంతమైన బౌలరే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఐపీఎల్‌లో ఈ రెండు కొత్త జట్లు తలపడుతున్న వేళ […]
మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాసేపటికే బీరెన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదురోజులే పనిదినాలు ఉండేలా కొత్త జీవో విడుదల చేశారు. ఈ నిర్ణయంతో మణిపూర్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి నుంచి అక్టోబరు వరకు ఉదయం 9 […]
మార్చి 31తో దేశవ్యాప్తంగా ప్రజలు కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని పనులకు గడువు తేదీని పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ గడువు తేదీని పొడిగించే పరిస్థితులు కనిపించడం లేదు. కావున మరో మూడురోజుల్లో గడువు ముగుస్తుంది కాబట్టి ఈ కింది పనులను పూర్తి చేయకుంటే ఇప్పుడే పూర్తి చేయండి. ★ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగుస్తోంది. ఆ తర్వాత […]
ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 205 పరుగులు చేసింది. దీంతో ఈ స్కోరును అంతంత మాత్రంగా బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న పంజాబ్ అందుకోలేదని అందరూ భావించారు. అయితే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు అద్భుతం చేసి చూపించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అందరూ దంచికొట్టారు. దీంతో కొండంత స్కోర్ కూడా కరిగిపోయింది. […]
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. సోమవారం నాడు సభలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా బీర్బూమ్ ఘటనపై సీఎం మమత మాట్లాడాలని బీజేపీ నేతలు పట్టుబట్టడం టీఎంసీ ఎమ్మెల్యేలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇటీవల బీర్బూమ్‌లో టీఎంసీ నేత […]
ఐపీఎల్‌లో మరో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆదివారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని సైతం పంజాబ్ కింగ్స్ చేధించింది. ఇరు జట్ల ఆటగాళ్లు బౌండరీలతో డీవై పాటిల్ స్టేడియాన్ని మోతెక్కించారు. దీంతో అభిమానులకు కావాల్సినంత మజా దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205/2 స్కోరు సాధించింది. కెప్టెన్ డుప్లెసిస్ (88), విరాట్ కోహ్లీ (41), దినేష్ కార్తీక్ (32), అనుజ్ రావత్ (21) […]
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లుగా దేశంలో టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన కాలర్ ట్యూన్‌లు ఎట్టకేలకు నిలిచిపోనున్నాయి. ఎప్పుడూ కాల్ చేసినా ‘కరోనాపై పోరాటంలో మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో’ అంటూ వినిపించే కాలర్ ట్యూన్‌లతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఈ కాలర్‌ట్యూన్ సెల్‌ఫోన్ వినియోగదారులకు పలు సందర్భాల్లో చికాకు కూడా తెప్పించేది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో టెలికాం ఆపరేటర్లు ఈ కాలర్ ట్యూన్‌ను త్వరలో తొలగించనున్నారు. ఈ కాలర్ ట్యూన్ కారణంగా […]
దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో అమర్‌నాథ్ ఒకటి. హిమాలయాల్లో కొలువుదీరే ఈ మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరలి వెళ్తుంటారు. వేసవిలో తప్ప మిగతా సమయంలో ఇక్కడ మంచు కప్పబడి ఉంటుంది. దీంతో వేసవిలో కొన్ని రోజులు మాత్రమే ఇక్కడి మంచులింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో పరమేశ్వరుడి భక్తుల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది అమర్నాథ్ […]
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఎంత పటిష్టమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్.. ఓటముల్లో కూడా రికార్డులు నెలకొల్పుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోతూనే వస్తోంది. తాజాగా ఈ సీజన్ ఐపీఎల్‌లోనూ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. దీంతో […]
ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ విస్తరణపై స్పందించారు. కొత్త మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది సీఎం జగన్‌కు ఉన్న విశేష అధికారం అని.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ నేతలు శిరసావహిస్తారని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోందని.. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీని గెలిపిస్తారని ధీమా […]