March 31st: త్వరపడండి.. మరో మూడు రోజుల్లో ముగుస్తున్న గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి 31తో దేశవ్యాప్తంగా ప్రజలు కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని పనులకు గడువు తేదీని పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ గడువు తేదీని పొడిగించే పరిస్థితులు కనిపించడం లేదు. కావున మరో మూడురోజుల్లో గడువు ముగుస్తుంది కాబట్టి ఈ కింది పనులను పూర్తి చేయకుంటే ఇప్పుడే పూర్తి చేయండి.
★ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగుస్తోంది. ఆ తర్వాత ఐటీ రిటర్నులను సమర్పించడం వీలుకాదు. అందువల్ల ఇంకమ్‌ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవారు మార్చి 31లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయండి
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
★ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింకేజీని ఇంకా చాలా మంది ఉద్యోగులు పూర్తి చేయలేదు. ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. గతంలో ఈ గడువును కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగించింది. ఒకవేళ మార్చి 31లోగా మీరు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం కష్టతరం అవుతుంది. అందువల్ల ఇప్పుడే ఆధార్-పాన్ లింకేజీని పూర్తి చేయండి. లేకపోతే రూ.10వేలు జరిమానా కట్టాల్సి రావొచ్చు.
★ మీ బ్యాంకు ఖాతాలో కేవైసీ పూర్తి చేయండి. పాన్, ఆధార్, అడ్రస్ ఐడెంటిటీల వివరాలను మార్చి 31లోగా సమర్పించండి. బ్యాంకు ఖాతాలో కేవైసీ పూర్తి చేయకుంటే మీరు చాలా ప్రయోజనాలను పొందలేరు. అందువల్ల ఈ పనిని మీ బ్యాంక్ శాఖకు వెళ్లి పూర్తి చేయండి.
★ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా మార్చి 31లోగా ఈ-కేవైసీ అప్‌డేట్ చేయాలి.
★ వివాద్ సే విశ్వాస్ పథకంలో భాగంగా పన్ను బాకీలను కూడా మార్చి 31లోగా చెల్లించండి. ఇలా చెల్లిస్తే వడ్డీతో పాటు అపరాధ రుసుములను రద్దు చేస్తామని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల వెల్లడించింది. కనుక ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి.
★ తెలంగాణలో వాహనాల పెండింగ్ ఛలానాలపై ప్రకటించిన డిస్కౌంట్ మార్చి 31లోగా ముగియనుంది. దీంతో వాహనాలపై ఛలానాలు ఉన్నవారు ఇప్పుడే డిస్కౌంట్ ఉపయోగించుకుని చెల్లింపులు చేయండి.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!