Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం పేదోళ్ల కడుపు కొట్టింది.. పోరాడాలని మల్లిఖార్జున ఖర్గే పిలుపు
- మోడీ ప్రభుత్వం పేదోళ్ల కడుపు కొట్టింది
- ఐక్యం కావాల్సిన సమయం వచ్చింది
- పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు ఖర్గే పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కోట్లాది మంది పేదోళ్ల కడుపు కొట్టిందని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో మలికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై ప్రధానంగా చర్చించారు.

Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోడీ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాన్ని రద్దు చేసి కోట్లాది మంది పేద, బలహీన వర్గాల ప్రజలను నిస్సహాయులను చేసింది. మోడీ ప్రభుత్వం పేదల కడుపుపై కొట్టడమే కాకుండా వారి వీపు వెనుక పొడిచింది. ఎంజీఎన్ఆర్ఈజీఏను రద్దు చేయడం జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం. సోనియా గాంధీ ఇటీవల రాసినట్లుగా ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం అందరి ఆశయాన్ని సాకారం చేసింది. పని చేసే రాజ్యాంగ హక్కును అమలు చేసింది. ఇప్పుడు ఈ పథకాన్ని సమాధి చేశారు. ఇది రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలోని కోట్లాది మంది శ్రామిక ప్రజలపై ఆర్థిక, మానవ పరిణామాలను కలిగిస్తుంది. మనందరినీ రక్షించే హక్కులను కాపాడుకోవడానికి ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఐక్యమవ్వడం అత్యవసరం.’’ అని అన్నారు.

ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పాటు ఇతర సీనియర్ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. శశిథరూర్ కూడా హాజరు కావడం ప్రత్యేక ఎట్రాక్షన్‌గా నిలిచింది.
ఇది కూడా చదవండి: Jabalpur: జబల్పూర్ అగ్రి వర్సిటీలో దారుణం.. యువతిపై గ్యాంగ్‌రేప్
ఇదిలా ఉంటే ఆదివారం (డిసెంబర్ 28) కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా
దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ చిత్రపటాలతో మండల, గ్రామస్థాయిల్లో పీసీసీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘పని చేసే హక్కు, శ్రమ గౌరవం, సమాజిక న్యాయం’’ పేరుతో ఆందోళనలు, నిరసనలు తెలపనున్నారు. ఉపాధి హామీ పథకం పేరును ‘జీ రామ్ జీ’గా మార్చారు. అప్పుడే కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ నిరసన తెలిపింది. రేపు దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
Delhi | In his opening remarks at the Congress Working Committee Meeting, Congress National President Mallikarjun Kharge says, "In the recent winter session of Parliament, the Modi government has abolished MGNREGA, leaving millions of poor and vulnerable people helpless. The Modi… pic.twitter.com/wcK3CcMjID
— ANI (@ANI) December 27, 2025
#WATCH | Delhi | Congress MP Shashi Tharoor arrives at the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan to attend the Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/SKZhFmgwyz
— ANI (@ANI) December 27, 2025
#WATCH | Delhi | Congress Working Committee (CWC) meeting ongoing at the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan. pic.twitter.com/poDXmcfouT
— ANI (@ANI) December 27, 2025
#WATCH | Delhi | Congress National President Mallikarjun Kharge greets Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Lok Sabha LoP Rahul Gandhi outside the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan. They enter the building together to attend… pic.twitter.com/CZPzaj4zCe
— ANI (@ANI) December 27, 2025
#WATCH | Delhi | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan to attend the Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/DbrlO1td5c
— ANI (@ANI) December 27, 2025
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!