ఐపీఎల్ 15వ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్రారంభించింది. పటిష్ట ముంబై ఇండియన్స్ జట్టును 4 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ముంబై ఇండియన్స్ విధించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఉఫ్ మని ఊదేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా లలిత్ యాదవ్ (48 నాటౌట్), అక్షర్ పటేల్ (38 నాటౌట్) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి ఢిల్లీ జట్టును గెలిపించారు. దీంతో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ బూడిద పాలైపోయింది. పృథ్వీ షా (38), […]
కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం.. అంటే వారానికి నాలుగురోజుల పాటు గన్నవరం నుంచి కడపకు విమాన సర్వీసులు నడుస్తాయని ఇండిగో అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇండిగో, ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఒప్పందాలు చేసుకుంది. మరోవైపు కడప నుంచి విజయవాడకే కాకుండా హైదరాబాద్, చెన్నై, విశాఖ, బెంగళూరు నగరాలకు కూడా విమాన సర్వీసులను నడుపుతామని ఇండిగో […]
కరోనా సంక్షోభం కారణంగా గత రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాజాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిపోవడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. విమాన సిబ్బంది ఇకపై పీపీఈ కిట్లు ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే విమానాశ్రయాల్లో, విమానాల్లో ప్రయాణికులు, సిబ్బంది మాస్కులు ధరించడం తప్పనిసరి అని […]
హాట్ హాట్‌గా సాగుతున్న సమ్మర్‌లో క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ కూల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతోంది. ఇప్పటికే ఐపీఎల్ సమరం ప్రారంభమైంది. మే 29 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సుమారు మూడు నెలల పాటు ఐపీఎల్ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను ఎలా చూడాలి అంటూ ఆలోచనలో పడ్డారు. టీవీ లేదా డిస్నీ హాట్‌స్టార్ లేని వారు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు. అయితే వాళ్లు తమ ఫోన్‌లో జియో టీవీ లేదా […]
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఖాతాలో మరో టైటిల్ చేరింది. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని పీవీ సింధు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి బుసానన్‌పై 21-16, 21-8 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. 49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో పీవీ సింధు సంపూర్ణ ఆధిపత్యం చేలాయించింది. ఈ ఏడాది సింధు ఖాతాలో ఇది రెండో టైటిల్ విజయం. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోదీ […]
దేశంలో రెండు మల్టీప్లెక్స్ దిగ్గజాలు కలవబోతున్నాయి. పీవీఆర్-ఐనాక్స్ సంస్థలు విలీనం కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఆదివారం రెండు కంపెనీలు అధికారికంగా ధ్రువీకరించాయి. అయితే మెక్సికన్ మల్టీపెక్స్ దిగ్గజం సినీపోలీస్‌కు పీవీఆర్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్నిరోజుల కిందట వరకు సినీపోలీస్‌ను కొనుగోలు చేయాలని పీవీఆర్ ప్రయత్నించింది. అయితే తాజాగా సినీపోలీస్‌కు హ్యాండ్ ఇచ్చి ఐనాక్స్‌తో పీవీఆర్ సంస్థ చేతులు కలిపింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంస్థలు ఒకటి కావాలని నిర్ణయించాయి. కాగా పీవీఆర్-ఐనాక్స్ డీల్ దేశీయ ఫిల్మ్ […]
ఎన్నో ఆశలతో న్యూజిలాండ్ వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు రిక్త హస్తాలతో స్వదేశానికి వచ్చేస్తోంది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆదివారం నాడు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలై.. తద్వారా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ టీమ్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఓడినప్పటికీ చివరి వరకూ మన మహిళలు పోరాడిన తీరు అద్భుతమని రాహుల్ గాంధీ కొనియాడారు. ప్రపంచకప్ […]
హైదరాబాద్ నగరంలో వాహనం లేని వారు ఎక్కువగా క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. వీరిలో చాలా మంది ఉబర్, ఓలా క్యాబ్‌లను బుక్ చేస్తుంటారు. అలాంటి వారికి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ చేదువార్తను అందించింది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా త్వరలో క్యాబ్ ఛార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇంధన ధరల కారణంగా ఈనెల 29 నుంచి ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ఏసీలను బంద్ చేస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ […]
ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందించేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జూన్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. 2018 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంఆ వేల మంది విద్యార్ధులు బీఈడీ, డీఈడీ పూర్తి చేసి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ […]