ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. నిబంధనల ప్రకారం ప్రతి టీమ్ నలుగురు విదేశీ ఆటగాళ్లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంటుంది. కానీ రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్, వెస్టిండీస్ ఆటగాడు ఆర్.పావెల్‌కు మాత్రమే జట్టులో అవకాశం కల్పించింది. గతంలో 2011లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి […]
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా ప్రైవేట్ పరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు మార్చి 28, 29 తేదీల్లో భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందుగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సూచించింది. అటు భారత్ బంద్‌కు దేశంలోని పలు రంగాలకు చెందిన కార్మికులు కూడా […]
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా కల చెదిరింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు వైఫల్యం చెందారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 277/7 స్కోర్ చేశారు. స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53), మిథాలీ రాజ్ (68), హర్మన్‌ప్రీత్ కౌర్ (48) రాణించారు. అనంతరం భారత్ నిర్దేశించిన […]
ఐపీఎల్ 15వ సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో మొదలుపెట్టింది. శనివారం చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ధోనీ హాఫ్ సెంచరీ (50 నాటౌట్)తో రాణించగా మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోది […]
రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో అటు రామ్‌చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీతో ఎన్టీఆర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ యువ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఈ హీరోలు వరుస విజయాలు సాధిస్తే టాలీవుడ్ పరిశ్రమకు వచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. అయితే ఈ హీరోలు రెండేళ్లకు […]
అప్పుడప్పుడు జీవితంలో మనం ఊహించని అద్భుతాలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఆ అద్భుతాలు మన కళ్ల ముందు జరిగితే నోరెళ్లబెట్టడం తప్ప ఏమీ చేయలేం. అయితే దేవుడి సన్నిధిలో వింత జరిగితే అది మహాద్భుతమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఓ ఆలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మేక ప్రతిరోజూ ఆలయానికి వచ్చి గంట మోగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. తిరునెల్వేలి జిల్లాలోని కలక్కాడ్ గ్రామం తొప్పు వీధిలో ఉండే అరుల్మిగు అంగాలా పరమేశ్వరీ ఆలయానికి […]
ఐపీఎల్-15లో తొలి మ్యాచ్‌లోనే ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. కోల్‌కతాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత తడబడింది. అయితే ధోనీ రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అసలు 120 పరుగులన్నా చెన్నై చేస్తుందా అని సందేహాలు కలిగిన వేళ.. ఆ జట్టు ఏకంగా 131 పరుగులు చేసింది. ధోనీ (50 నాటౌట్), జడేజా (26 నాటౌట్) భాగస్వామ్యంతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 131 పరుగులు చేసింది. […]
శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో గతంలో ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఈ ఏడాది సెప్టెంబర్ దాకా పేదలకు ఉచిత రేషన్ అందనుంది. ఈ పథకం కింద దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా […]
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఇంధన కొరత, వంట గ్యాస్ కొరత కారణంగా ఆ దేశంలో వేలాది హోటళ్లు మూతపడ్డాయి. దీంతో ప్రజలు అంధకారంతో పాటు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది పక్క దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఇంధన కొరత ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందించింది. అత్యవసరంగా 40వేల టన్నుల డీజిల్ పంపించాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దీన్ని రవాణా […]
ఒక్కొక్కరికి ఒక్కో అభిమానం ఉంటుంది. కొందరికి సినిమా స్టార్లు అంటే పిచ్చి. ఇంకొందరికి రాజకీయ నేతలంటే అభిమానం. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఏపీలోనూ అభిమానులు ఉన్నారు. దీంతో కేటీఆర్ సీఎం కావాలంటూ ఏపీలోని ఓ అభిమాని బైక్ యాత్ర చేపట్టాడు. గుంటూరు జిల్లాకు చెందిన బాలరాజుగౌడ్ అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి యాదాద్రి వరకు బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. తన బైక్ […]