ఐపీఎల్‌లో విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ కూడా ఉంటాడు. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు ఈ ఏడాది కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మరోవైపు ఇంకో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆప్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ బరిలోకి దిగుతున్నాడు. రషీద్ ఖాన్ కూడా ఐపీఎల్‌లో విజయవంతమైన బౌలరే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఐపీఎల్‌లో ఈ రెండు కొత్త జట్లు తలపడుతున్న వేళ కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ హెడ్ టు హెడ్ తలపడినప్పుడు ఆ మజా ఎలా ఉంటుందో క్రికెట్ అభిమానులకు చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే టీ20 ఫార్మాట్‌లో మాత్రం రషీద్ ఖాన్‌దే పైచేయిగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో రషీద్ ఖాన్ వేసిన 30 బంతులను కేఎల్ రాహుల్ ఎదుర్కోగా అతడు కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. స్టైక్ రేటు 60 మాత్రమే ఉంది. ఇక యావరేజ్ 6గా నమోదైంది. రషీద్ ఖాన్ మూడు సార్లు కేఎల్ రాహుల్‌ను అవుట్ చేశాడు. అంతేకాకుండా ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. దీంతో సోమవారం జరిగే మ్యాచ్‌లో వీళ్లిద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో ఆసక్తికర అంశంగా మారింది. ఈసారైనా రషీద్ ఖాన్‌ను కేఎల్ రాహుల్ సమర్ధవంతంగా ఎదుర్కోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
KL Rahul vs Rashid Khan in T20s:
— CricTracker (@Cricketracker) March 28, 2022
18 – Runs
30 – Balls
3 – Outs
14 – Dots
0 – 4s
0 – 6s
60.0 – SR
6.0 – Avg#LSGvGT #IPL2022