ఐపీఎల్‌లో కొత్త జట్ల సమరం ఆసక్తికరంగా సాగింది. సోమవారం రాత్రి లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో టీమ్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. గుజరాత్ బౌలర్ మహ్మద్ షమీ ఈ వికెట్ సాధించాడు. షమీ విజృంభించడంతో లక్నో టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్ […]
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురై నిరాశలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తాజాగా జట్టులో చేరాడు. వీసా నిబంధనల్లో సాంకేతిక సమస్యల కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన మొయిన్ అలీ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. 2021లో చెన్నై టైటిల్ గెలవడంలో మొయిన్ అలీ కీలక పాత్ర పోషించాడు. అందుకే ఈ ఏడాది చెన్నై యాజమాన్యం రుతురాజ్ గైక్వాడ్, ధోనీ, జడేజాలతో పాటు […]
ఐపీఎల్ మ్యాచ్‌లు నెమ్మదిగా రసపట్టును తలపిస్తున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్ తేలిపోయినా.. సూపర్ సండేనాడు జరిగిన రెండు మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించాయి. తొలుత ముంబై-ఢిల్లీ మ్యాచ్, అనంతరం బెంగళూరు-పంజాబ్ మ్యాచ్ ఉర్రూతలూగించాయి. ఈ రెండు మ్యాచ్‌లలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిపించాయి. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయేలా కనిపించగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ పోరాడి తమ జట్టును గెలిపించారు. ముఖ్యంగా లలిత్ యాదవ్ 48 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ […]
రష్యా దాడితో ఉక్రెయిన్ దేశం అతలాకుతలం అవుతోంది. అక్కడి ప్రజలు కనీస అవసరాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రిజేంద్ర రానా అనే వ్యాపారి ఉక్రెయిన్‌కు తన వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.40 కోట్లు విలువైన వైద్య పరికరాలు, ఉత్పత్తులను ఉక్రెయిన్దేశానికి ఉచితంగా అందించారు. 1992లో ఉక్రెయిన్‌కు వెళ్లిన బ్రిజేంద్ర రానా అక్కడి ఖార్కీవ్ నగరంలోనే వైద్య విద్యను అభ్యసించారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే స్నేహితులతో కలిసి ఫార్మాసుటికల్ కంపెనీని […]
మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆస్తులు చూసి అధికారులు షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఘాటిగావ్‌కు చెందిన ప్రశాంత్ పర్మార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‍గా పనిచేస్తున్నాడు. అతడి నెల జీతం వేలల్లో మాత్రమే ఉంటుంది. అయితే అతడు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో అతడి నివాసంతో పాటు ఇతర ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ సోదాల్లో ప్రశాంత్ పర్మార్ ఆస్తుల జాబితా అధికారులను అవాక్కయ్యేలా చేసింది. ప్రశాంత్ […]
ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఈరోజే తొలిసారిగా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఆ రెండు జట్లే లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్‌కు హార్డిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. తొలిసారిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ రెండు జట్లలో విజయం […]
సాధారణంగా పొట్టి క్రికెట్‌లో బౌలర్ల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లు బౌలర్లను చితకబాది పరుగుల మీద పరుగులు చేస్తుంటారు. దీంతో బౌలర్ల గణాంకాలు దారుణంగా నమోదవుతుంటాయి. ఒక రకంగా బౌలర్‌కు టీ20 ఫార్మాట్‌లో బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటారు. బౌలర్లు ఓవర్‌కు 10కి పైగా పరుగులు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు అనే చెప్పాలి. అయితే ఐపీఎల్‌లో బెస్ట్ ఎకానమీతో […]
ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తమ ప్రదర్శన చేసిన భారతీయ జనతా పార్టీ రాబోయే రెండేళ్లలో జరిగే వివిధ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమవుతోంది. ఒక దాని తరువాత ఒకటిగా నిరంతరం ఎన్నికల కోసం పనిచేయటం బీజేపీ ప్రత్యేకత. నిరంతరం గెలుపు వ్యూహాలకు పదును పెడుతూనే ఉంటుంది. ఉత్తరాదితో పాటు ఈశాన్య భారతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. కానీ దక్షిణాది విషయంలో ఆ పరిస్థితి లేదు. కర్ణాటక మినహా మిగతా నాలుగు రాష్ట్రాలో అధికారం […]
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. తెలంగాణలో వచ్చే ఐదురోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. సుమారు రెండు నుంచి మూడు డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రాగల 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని హైదరాబాద్ […]
తెలంగాణలో ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష.. జూలై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన చేసింది. ఎంసెట్ పరీక్ష కోసం దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు అయితే రూ.800.. ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.400 చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఈసెట్ […]